జేఏసీ ఉద్యమాలకు సచివాలయ ఉద్యోగుల మద్దతు | - | Sakshi
Sakshi News home page

జేఏసీ ఉద్యమాలకు సచివాలయ ఉద్యోగుల మద్దతు

Jul 5 2026 7:50 AM | Updated on Jul 5 2026 7:50 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జూలై 12న నిర్వహించనున్న తొలి ఉద్యమ సన్నద్ధ సభను విజయవంతం చేయడానికి స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ మేరకు శనివారం రెవెన్యూ వసతి గృహంలో ఉద్యమాలకు మద్దతుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీల జిల్లా కార్యదర్శి జి.తిరుమలరావు, వీఆర్వోల సంఘం జిల్లా ట్రైజరర్‌ జి.ఢిల్లేశ్వరరావు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.సూర్య భరత్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ల జిల్లా అధ్యక్షుడు కె.సుధీర్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌ల ప్రతినిధి వి.హరిప్రసాద్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ల ప్రతినిధి అబ్దుల్‌ రజాక్‌, అర్బన్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీల జిల్లా అధ్యక్షుడు పనిరఘునాథ్‌, టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీల జిల్లా అధ్యక్షుడు రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement