ఇచ్ఛాపురం రూరల్: ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల సేవల కోసం వినియోగించాల్సి ఉండ గా, కొందరు అధికార పార్టీ నాయకులు వాటిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు మంగళవారం తన వ్యక్తిగత ఎలక్ట్రిక్ బైక్‌కు చార్జింగ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ విద్యుత్‌ను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని సొంత ఆస్తిలా ఉపయోగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● టీడీపీ నాయకుడి దుశ్చర్య


