గిరిజన నాయకులపై ఎమ్మెల్యే ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

గిరిజన నాయకులపై ఎమ్మెల్యే ఆగ్రహం

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

ఆమదాలవలస రూరల్‌: పిల్లలను చంపేంత కష్టం ఏం వచ్చిందో..? గొంతుపై కత్తి పెట్టేంత కర్కశం ఎందుకు వచ్చిందో..? ప్రాణం తీసుకోవాలనేంత ఆలోచన ఆ మనసులో ఎలా చేరిందో గానీ.. ఆ కన్నతల్లి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల మరణ శాసనం రాసింది. ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో మంగళవారం కూర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన బిడ్డలైన కూర్మాపు భవాని(3), కూర్మాపు చాందిని (4నెలలు)ని కత్తితో గొంతుకోసి దారుణంగా హతమార్చింది. ఆమె కూడా కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో ఉంది. ఆమె భర్త కూర్మా పు రమణ వరంగల్‌లో కూలి పనులు చేస్తూ ఉంటారు. ఈ సంఘటనతో వెదుళ్లవలస శోకసంద్రమైంది. ఊరు ఊరంతా కంట తడి పెట్టింది.

కలహాలే కారణమా..?

వరలక్ష్మికి అత్త కూర్మాపు లక్ష్మితో కలహాలు ఉన్నా యి. కుటుంబంలో వరలక్ష్మి వద్దనే అత్త కూర్మాపు లక్ష్మి ఉంటున్నారు. కొంత కాలం నుంచి అత్త వేధింపులకు పాల్పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి రెండుగంటల వరకు అత్త, కోడలు ఘర్షణ పడ్డారని, దీంతో అత్త వేధింపులు భరించలేక పిల్లలను హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

అత్తాకోడళ్లు రాత్రి ఘర్షణ పడ్డాక అత్త ఇంటి బయట నిద్రపోయింది. తల్లీపిల్లలు తలుపులు వేసుకుని లోపల నిద్రపోయారు. ఉదయం 5 గంటల సమయానికి అత్త తలుపులు తట్టగా ఎవరూ తీయలేదు. దీంతో చుట్టుపక్కల వారికి సమా చారం ఇవ్వగా వారు వచ్చి చూశారు. తలుపులు తీయగా రక్తపు మడుగులో తల్లీపిల్లలు కనిపించడంతో నిశ్చేష్టులైపోయారు. వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. తల్లి మాత్రం కొన ఊపిరితో ఉంది. వెంటనే ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించా రు. పసి పిల్లలు అలా పడుకున్నట్టే ప్రాణాలు విడిచేసిన దృశ్యాలు చూసి స్థానికులు కంట తడి పెట్టారు. రాత్రి మూడింటి తర్వాతే ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అత్త వేధింపులతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఈ ఘటనకు కారణమై ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది.

ఘటనా స్థలానికి పోలీసులు

ఈ విషయం తెలిసిన వెంటనే వెదుళ్లవలసకు పోలీసులు చేరుకున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, ఆమదాలవలస సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు సంఘటన జరిగిన విషయం గ్రామస్తులను అడిగి తెలుసున్నారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాపు చేస్తామని డీఎస్పీ చెప్పారు. తల్లి కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.

సారవకోట: మండలంలోని పలువురు గిరిజన నాయకులపై నరసన్నపేట ఎంఎల్‌ఏ బగ్గు రమణమూర్తి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని గిరిజన మత్స్యకారులకు ద్విచక్ర వాహనం, ఐస్‌ బాక్స్‌లు మంజూరయ్యాయి. బుడితి సొసైటీ సభ్యులు ఆరుగురికి ఈ యూనిట్లు మంజూరు కాగా బొమ్మికపేట, సింగంవలస గ్రామాల కు చెందిన ఇద్దరు గిరిజనులకు సైతం రెండు యూ నిట్లు మంజూరయ్యాయి. బొమ్మికపేట, సింగంవలస గ్రామాలకు చెందిన ఇద్దరికి తన నోటీసులో లేకుండా ఏ విధంగా యూనిట్లు మంజూరు చేశా రని సంబంధిత శాఖ సిబ్బంది పై తొలుత ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేయగా.. ఐటీడీఏ నుంచి వచ్చిన యూనిట్లను మీరు ఎలా మంజూరు చేయించుకుంటారని గిరిజన నాయకులైన జన్ని రామారావు, బి.తులసీరావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఐటీడీఏ సీతంపేటలో దరఖాస్తు చేసుకున్నామని, మంజూరయ్యాయని ఇద్దరూ సమాధానమిచ్చారు.

అమ్మ తప్ప వారికేదీ తెలీదు.. ఆకలేస్తే అమ్మ..

నిద్ర వస్తే అమ్మ.. నిద్రలో ఉలికిపడినా అమ్మ..

నొప్పి పుట్టినా అమ్మే కావాలి. ఆ రాత్రి కూడా గొంతు వద్ద ఏదో కోసుకుంటుంటే అమ్మా.. అనే అరిచి ఉంటారు. రక్తం ధార కట్టి ఊపిరి పోతూ ఉంటే అమ్మనే తలచుకుని ఉంటారు. ప్రాణం గాల్లో కలిసిపోతూ ఉన్న సమయాన అమ్మా.. అమ్మా అంటూ ఏడ్చి ఉంటారు. ఆ పసివాళ్లకేం తెలుసు.. ఆ గొంతు కోసింది అమ్మేనని. ఆ చిన్నారులకేం తెలుసు తమ ప్రాణాలు తీసింది కన్నతల్లేనని. వెదుళ్లవలసలో కన్నతల్లి ఇద్దరు బిడ్డల గొంతుకోసి చంపేసింది. తాను కూడా గొంతు కోసుకుని చనిపోవడానికి ప్రయత్నించింది.

పసికందుల గొంతు కోసి చంపిన కన్నతల్లి

అనంతరం పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం

వెదుళ్లవలసలో ఘటన

కొన ఊపిరితో చికిత్స పొందుతున్న తల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement