బతుకును పెంచుకో | - | Sakshi
Sakshi News home page

బతుకును పెంచుకో

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది

ఆత్యహత్య దేనికీ పరిష్కారం

కాదంటున్న సామాజిక వేత్తలు

ఒక్క క్షణం ఆలోచించండి అంటున్న మానసిక నిపుణులు

..

ధైర్యం చెప్పాలి..

బతకడానికి బలమైన కారణం లేకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కష్టం వచ్చినప్పుడు ధైర్యం చెప్పే వారు ఉండాలి. ఎవరికి వారే కుమిలిపోవడం, ఒంటరి తనం ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు.

– డాక్టర్‌ రోష్‌ మల్లిఖార్జున్‌,

మానసిక వైద్యనిపుణులు

కౌన్సెలింగ్‌ తప్పనిసరి

జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. పిల్లలు సమాజంలో బతకడం కష్టమనే భావంతో ఇలా చేస్తున్నారు. ఇలాంటి వారికి కౌన్సెలింగ్‌ తప్పనిసరి. సమస్య ఉంటే కౌన్సెలర్లను సంప్రదించాలి. టెలి మానస్‌ నంబర్‌ 144106కు ఫోన్‌ చేసినా కావాల్సిన సలహాలు ఇస్తారు.

– డాక్టర్‌ బెండి సాయిరామ్‌, మానసిక వైద్యులు

ముందుగానే గుర్తించాలి

పిల్లలు జీవించే హక్కును ఎవరి హరించినా నేరమే. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మానసిక, ఆర్థిక సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ ఇస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి.

– కొమ్ము రమణమూర్తి, అడ్వకేట్‌, సోషల్‌ వర్కర్‌

శ్రీకాకుళం కల్చరల్‌ :

కుంగుబాటు, మానసిక క్షోభ, ఒంటరితనం, క్షణికావేశం.. కలగలిపి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. మనసులో ఉన్న ఆందోళనను ఎవరూ గుర్తించకపోవడం, బాధను ఎవరితోనూ పంచుకోకపోవడం, సరైన సమయానికి మాట్లాడే వారు లేకపోవడంతో జిల్లాలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అయితే దీని నివారణకు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌ అనేది ప్రాణాలను నిలబెడుతుందని అంటున్నారు. క్షణికావేశాల్లో బతుకులను బలి చేసుకుంటున్న వారికి ఇదే మార్గమని సూచిస్తున్నారు.

ఇటీవల ఘటనలు..

● మే 14న ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో తల్లితో గొడవపడి రాజేష్‌, గార మండలం గిడిపేటలో భార్య మద్యం తా గొద్దన్నందుకు కర్రి త్రినాధరావు చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించారు.

● సారవకోట మండలం కురిడిలో భాస్కరరావు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● జూన్‌ 19న పలాస రైల్వేస్టేషన్‌ సమీపంలోని తాళభద్ర వద్ద తల్లి ఇద్దరు పిల్లలను రైలు కింద తోసి తనూ ఆత్మహత్య చేసుకుంది.

● మే 4న జి.సిగడాంలో తన భర్త హోంగార్డు శ్యామలరావు మద్యానికి, బెట్టింగ్‌లకు బానిసై బంగారాన్ని అమ్మేయడంతో భార్య ఉరి వేసుకుంది.

● అప్పు ఇస్తే తిరిగి అవతలివారే కేసు పెట్టడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్‌ 11న పాతపట్నం చిన లోగిడికి చెందిన ఆటో డ్రైవర్‌ దయానిధి ఆత్మహత్య చేసుకున్నాడు.

కుంగుబాటే కారణం..

కుంగుబాటు, మానసిక క్షోభ ఎంతో మందిని చంపేస్తున్నా యి. వీటి నివారణకు కౌన్సె లింగ్‌ సెంటర్ల ఏర్పాటు అత్యవసరం. ఒంటరితనం, నిరాశ, లేదా క్షోభ వంటి సంకేతాలను గమనిస్తే వారితో మాట్లాడాలి. యోగా, శ్వాస ద్వారా స్థైర్యాన్ని పెంచుకోవడం కుంగుబాటును, ఆందోళనను తగ్గిస్తుంది.

– యార్లగడ్డ గీత, ఏపీలోని ’ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’, అపెక్స్‌ మెంబెర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement