దిష్టిబొమ్మల్లా కుళాయిలు | - | Sakshi
Sakshi News home page

దిష్టిబొమ్మల్లా కుళాయిలు

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

జి.సిగడాం: ఆనందపురం.. పేరులో ఉన్న ఆనందం బతుకులో లేకపోయింది. 700 కుటుంబాలు నివసిస్తున్న గ్రామానికి కుళాయిలు ఉన్నాయి గానీ చుక్క నీరు రావడం లేదు. గత ప్రభుత్వం హయాంలో కుళాయిలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని వాటర్‌ ట్యాంకు ప్రస్తుతం శిథిలం కావడంతో కుళాయిల ద్వారా నీరు రావడం లేదు. అధికారులు, నాయ కులు సమీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్నా అవేవీ సఫలం కావడం లేదు. గత ఏడాది మార్చిలో ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ మాట నెరవేరలేదు.

నీటి కోసం ఆరాటం

నేలబావి నుంచి నీరు తెచ్చుకోవాలంటే నరకం కనిపిస్తోంది. తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని సార్లు వినతులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – గొర్లె లక్ష్మి, ఆనందపురం, జి.సిగడాం

ఇబ్బంది పడుతున్నాం

చాలా దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. వాటర్‌ ట్యాంకు నిర్మించి నీరందించాలి.

– చిత్తిరి అప్పమ్మ, ఆనందపురం, జి.సిగడాం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement