ఒన్ డిస్ట్రిక్ట్, ఒన్ ప్రొడక్ట్ పథకంలో భాగంగా ఎంపికైన పొందూరు చేనేత చీరలకు మహర్దశ కలిగిదని కేంద్ర మూల్యాంకన అధికారులు హర్‌ప్రీత్ సింగ్, శిష్టి తెలిపారు. మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మూల్యాంకన బృందం అధికారులు పొందూరు ఖాదీ చేనేత కాటన్ చీరల ఉత్పత్తిని పరిశీలించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్‌ట్రేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓడీఓపీకి పొందూరు కాటన్ చీరల భౌతిక పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మూల్యాంకన బృందం పర్యటించింది. తండ్యా మెట్టలో చేనేత, కాటన్‌చీరలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా చేనేతజౌళిశాఖ అధికారి టి జనార్ధనరావు, చేనేత సొసైటీ మేనేజర్ ఒ.శ్రీనివాసరావు, ఏఎఫ్‌కేకే సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరప్రసాద్, డి.వెంకటరమణ పాల్గొన్నారు. –పొందూరు


