ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాలకు మద్దతు | - | Sakshi
Sakshi News home page

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాలకు మద్దతు

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జూలై 12 నుంచి జరగనున్న తొలి విడత ఉద్యమాలకు ఆంధ్రప్రదేశ్‌ సహకార శాఖ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సహకార శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు పి.జానకిరామ్‌ తదితరులు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ బి.వి.వి.ఎన్‌.రాజును కలిశారు. కార్యక్రమంలో జేఏసీ అసోసియేట్‌ చైర్మన్‌ దామోదర్‌, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అరుణకుమారి, ఏపీ సహకార శాఖ సేవా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement