పట్టుబడిన దారిదోపిడీ దొంగలు | - | Sakshi
Sakshi News home page

పట్టుబడిన దారిదోపిడీ దొంగలు

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

శ్రీకాకుళం రూరల్‌ : శ్రీకాకుళం రూరల్‌ పోలీస్టేషన్‌ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన దారిదోపిడీ కేసులో నిందితులను రూరల్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేసు వివరాలను మంగళవారం టౌన్‌ సీఐ పైడపునాయుడు, రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ విలేకరులకు వెల్లడించారు. మద్యానికి బానిసైన శ్రీకాకుళం నగరానికి చెందిన కొంకాన వెంకటనారాయణ, పడిపాటి నితిన్‌రెడ్డి, కొల్లు విజయ్‌కుమార్‌లు సులువుగా డబ్బులు సంపదించాలని దారిదోపిడీల మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఖాజీపేటకు చెందిన పంచిరెడ్డి అప్పలనాయుడు శ్రీకాకుళం పట్టణం నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఉదయం 4 గంటల సమయంలో అదే మార్గంలో ద్విచక్ర వాహనం వస్తున్న ఈ ముగ్గురూ కలిసి దాడిచేశారు. అతని జేబులో రూ.20వేల నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. వీరిలో ఇద్దరు పట్టుబడగా, విజయ్‌కుమార్‌ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి రూ.7500 నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

శతాధిక వృద్ధురాలి మృతి

వజ్రపుకొత్తూరు రూరల్‌: బాతుపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు తామాడ పాపుడమ్మ (105) మంగళవారం మృతి చెందారు. ఈమె 1973లో సర్పంచ్‌గా పనిచేశారు. ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త పోలినాయుడు పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆయన కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. సరస్వతమ్మ వైఎస్సార్‌ సీపీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలు అందించారు. ఈమె మృతి పట్ల తాజా మాజీ సర్పంచ్‌ బత్తిని సృజన లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు సంతాపం తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement