రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో బంగారు పతకం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో బంగారు పతకం

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శివానీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సి.ఎస్‌.ఈ.విద్యార్థి ఎండ శివచరణ్‌ జూన్‌ 27, 28వ తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలలో అండర్‌–23 విభాగంలో 72 కేజీల గ్రీకోరోమన్‌ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యులు వి.ఎం.ఎం.సాయినాథ్‌రెడ్డి, కె.దుర్గా శ్రీనివాసరావు, పి.దుర్గాప్రసాద్‌రాజు, డి.వెంకటరావు, డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, జె.హరీష్‌లు శివచరణ్‌ను అభినందించారు. జూలై 10, 11వ తేదీలలో హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లోనూ పతకం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వై.శ్రీనివాసరావు, జి.టి చంద్రశేఖర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.రాజ్‌కిరణ్‌, ఎస్వీఎస్‌ సునీల్‌కుమార్‌, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement