టెక్కలి : టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి తీరు సక్రమంగా లేదని, కేవలం మంత్రి అచ్చెన్నాయుడుకు మాత్రమే తాబేదారుగా పనిచేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు పనిచేయడం లేదని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో లోపాలున్నాయని, నిమ్మాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌ల్లో కొన్నేళ్లుగా మరణించిన వారి ఓట్లు తొలగించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో.. సోమవారం తిలక్ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆర్డీఓను కలిశారు. కానీ, సమస్య స్వీకరించే విషయంలో ఆర్డీఓ తీరు నచ్చకపోవడంతో అసహనంతో ఆయన బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన ఆర్డీఓ పూర్తిగా మంత్రి అచ్చెన్నాయుడు మెప్పు కోసం ఒక ఏజెంట్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సర్ ప్రక్రియలో లోపాలున్నాయని చెబితే మాపై తిరుగుబాటు చేసేలా వ్యవహరించడం అత్యంత హేయనీయమన్నా రు. మరోవైపు.. టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయ కులతో నిర్వహిస్తున్న సమావేశాన్ని ఆర్డీఓ తీరు నచ్చక బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ టెక్కలి మండలం అధ్యక్షుడు హనుమంతు వెంకటేశ్వరరావు చెప్పారు.
పలాస: మండలంలోని కోసంగిపురం వద్దనున్న జగనన్న కాలనీలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుకుంది. కాలనీకి చెందిన నెయ్యిల ఉమామహేశ్వరరావు (56) అనారోగ్యంతో మృతి చెందాడు. పిల్లలు చిన్నవారు కావడంతో ఉమామహేశ్వరరావు భార్య సరస్వతి ఆయనకు తలకొరివి పెట్టింది. దీంతో కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి.
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీ సు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు బాధితుల నుంచి 61 ఫిర్యాదులు అందా యి. ఎస్పీ కె.వి.మహేశ్వరరె డ్డి బాధితుల నుంచి ఫిర్యా దులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలుతెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.


