సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

సమస్యలు పరిష్కరించాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్‌ హమాలీ ల సమస్యలు పరిష్కరించాలని సివిల్‌ సప్లయ్‌ హమాలీ వర్క ర్స్‌ యూనియన్‌ శ్రీకాకుళం శాఖ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం జీజీఆర్‌ఎస్‌ వద్ద జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర ప్రభుత్వం అదే పనిగా హమీలీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నెలాఖరు వరకు కూలీలు జమ అవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు కార్పొరేషన్‌ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో యూనియన్‌ నాయకులు కెస్‌ నారాయణ, చిక్కాల గోవిందరావు తదితరులు వినతిపత్రంను అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement