డ్రైవర్ మత్తే మా అమ్మ ప్రాణం తీసింది
పెద్దపాడు ఫ్లైఓవర్‌పై
మలుపులో రాత్రి సమయాన లారీ పార్కింగ్
మా కుటుంబానికి పెద్ద దిక్కు మా అమ్మ మురపాల పార్వతి. ఎన్నో ఏళ్లుగా ఆటోలో ప్రయాణం చేసినా ఎప్పుడూ ఏమీ కాలేదు. లారీ డ్రైవర్ మద్యంతాగి బండి నడిపి మా అమ్మను పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతోంది. అదే ఈ ప్రమాదానికి కారణమైంది. రోడ్డుపై తనిఖీలు జరుగుతున్నాయా లేదా అన్న అనుమా నం కలుగుతోంది. వ్యవస్థలో లోపాలే దీనికి కారణం.
– మురపాల సంగీత,
మృతురాలు మురపాల పార్వతి కుమార్తె
శ్రీకాకుళం క్రైమ్ :
●కవిటి మండలంలో వ్యాపారం చేసుకుందామని ఇంటి నుంచి బయల్దేరిన ముగ్గురు మహిళలను ఓ డ్రైవర్ మద్యం మత్తు బలి తీసుకుంది.
●కొర్లాం ప్రాంతంలో ఓ లారీ డ్రైవర్ మత్తులో రాంగ్‌రూట్‌లోకి వచ్చేయడంతో మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
●నందిగాం ఫ్లై ఓవర్‌లో బ్రేక్‌డౌన్ అయిన ఐరన్ వ్యాన్‌ను ఒడిశా నుంచి వస్తున్న స్కార్పియో ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు.
ఇవే కాదు ఇలాంటి ఘటనలు ఇంకెన్నో జరిగాయి. వీటిలో మెజారిటీ సంఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిద్ర మత్తు, మద్యం మత్తు, మితిమీరిన వేగం వంటి కారణాల వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన ప్రమాదాల్లో 46 మందికి మరణాలు సంభవిస్తే.. గడిచిన 2 నెల ల్లో 33 మంది మృత్యువాత పడటం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది రహదారి నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తు, నిద్రమత్తు, మితిమీరిన వేగం, అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, అదుపు తప్పి ఆగి ఉన్న వాహనాలను, కల్వర్టులను, స్తంభాలను ఢీకొట్టడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి స్వయం తప్పిదాలున్న వారే కాక ఎదుటివారి ర్యాష్ డ్రైవ్, రహదారుల్లో భద్రతా లోపాలు వంటివీ కారణంగా కనిపిస్తుండటం గమనార్హం.
ఎస్పీ మాట వింటున్నారా..?
రోడ్డు ప్రమాదాలపై ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అను నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. అనేక సూచనలు చేస్తున్నారు. కానీ అవి క్షేత్రస్థాయిలో అమలులోకి రావడం లేదనే మాట వినిపిస్తోంది. హైవే పెట్రోలింగ్ వాహనాలు తక్షణమే స్పందించి క్షణాల్లో ఘటనాస్థలికి చేరాలని, స్పీడ్ ర్యాష్, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్, మైనర్ రైడింగ్ చేస్తున్నవారి వాహనాలు ఆపాలని, అర్ధరాత్రి, వేకువజామున లారీ, కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లను ఆపి ఫేష్‌వాష్ చేయించాలని, హైవేలపైన, కింద సర్వీసు రోడ్డులపైన, ఫ్లై ఓవర్ల కింద భారీ వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలని ఎంత చెబుతున్నా ఎవరూ వినడం లేదు. దానికి నిదర్శనమే ఈ ప్రమాదాలు.
●సర్వీసు రోడ్డు నుంచి హైవేకి వెళ్లేటప్పుడు అధిక వేగంతో వాహనాలు వెళ్లడం, ఒకే మార్గంలో ఎదురెదురుగా వాహనాలు రావడం.
●వాహనదారుల మద్యం మత్తు, నిద్ర మత్తు, రహదారి నిబంధనలు ఉల్లంఘించడం.
●హైవే వెంబడి రాత్రి పూట లైట్లు వెలగకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, హెచ్చరిక బోర్డులు అనుకున్న స్థాయిలో లేకపోవడం.
●ఎన్‌హెచ్–16 నుంచి సర్వీసు రోడ్డులోకి ఎంటరయ్యేటప్పుడు జిల్లాలో చాలా చోట్ల కాంక్రీట్ దిమ్మలు అడ్డంగా ఉండటం, ఇసుక లారీలు రవాణాతో దారి పొడవునా ఇసుక పేరుకుపోయి వాహనాలు స్కిడ్ అవ్వడం.
●ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం వరకు లారీలు సర్వీసు రోడ్లలోనే కాక ఫ్లై ఓవర్లు, హైవేలపై రోజుల గంటల తరబడి పార్కింగ్ చేయడం, ఫ్లై ఓవర్ల కింద రోజుల తరబడి ఉంచేయడం.
●హైవేల వెంబడి ముఖ్య కూడళ్లలో దాబాలు, హోటళ్లు, టోల్‌ప్లాజాల వద్ద పోలీసుల తనిఖీలు శూన్యం. అక్కడే మద్యం పూటుగా సేవించి భారీ వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
●హైవేకు లింక్‌గా ఉన్న గ్రామీణ రహదారుల్లో భారీగా గోతులుండటం, ఇరువైపులా పొదలు అల్లుకుపోయి మలుపుల్లో వచ్చే వాహనాలు, కల్వర్టులు కనపడకపోవడం, సైడ్ ఎడ్జ్‌ల్లో గ్రావెల్ నింపకపోవడం.
●కొత్త బ్లాక్‌స్పాట్లు గుర్తించకపోవడం, పాత బ్లాక్‌స్పాటుల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడం, సూచిక బోర్డులు లేకపోవడం కారణాలు.
నరసన్నపేట జమ్ము కూడలి సమీప సర్వీసు రోడ్డులో లారీలు పార్కింగ్
రహదారి ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలి. హైవేల్లో నెలకొన్న సమస్యలపై ఇతర విభాగాల అధికారులతోను సమన్వయం చేసుకుంటూ ఉన్నతాధికారికి నివేదించి చర్యలు తీసుకుంటాం.
– పి.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ,
శ్రీకాకుళం
మద్యం
మత్తులోనే
ఘోరం
చాలా ఏళ్లుగా మా అమ్మ ఉద్దానంలో కొబ్బరి కా యలు, పనసపండ్లు తదితర వస్తువులు ఇక్కడ కొని బరంపురంలో విక్రయిస్తోంది. ఎప్పుడూ చిన్న సమస్య కూడా రాలేదు. కేవలం డ్రైవర్ మ ద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణం. మాలాంటి దుస్థితి ఎవరికీ రాలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తని ఖీలు చేసి ఉంటే మా అమ్మ బతికి ఉండేదేమో.
– నర్తు నారాయణరావు, రాపాకపుట్టుగ, కవిటి మండలం


