మేం ఓటర్లం కాదా.. పన్నులు కట్టడం లేదా? | - | Sakshi
Sakshi News home page

మేం ఓటర్లం కాదా.. పన్నులు కట్టడం లేదా?

Jun 30 2026 12:31 AM | Updated on Jun 30 2026 12:31 AM

మేం ఓటర్లం కాదా.. పన్నులు కట్టడం లేదా? ● పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన వజ్రంపేట మహిళలు ● ఏడాదిగా నీరు రావడం లేదని ఆవేదన నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం సిబ్బంది నిర్లక్ష్యమే..

మేము పన్ను కట్టడం లేదా

● పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన వజ్రంపేట మహిళలు ● ఏడాదిగా నీరు రావడం లేదని ఆవేదన

మాకు ఒక పూట నీరు వస్తుంది. అది కూడా పైపు ను గట్టిగా పీల్చితే నాలుగైదు లీటర్లు నీరు వస్తుంది. పీల్చకపోతే అదీ రాదు. దీంతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. అధికారులు చర్యలు తీసుకోవాలి. – రావాడ పార్వతి, వజ్రంపేట

నరసన్నపేట: ‘అయ్యా.. పంచాయతీ వారూ.. మేము వజ్రంపేటలో ఉంటున్నాం. తాగడానికి

బిందెడు నీరు ఇప్పించండి.. మీ పేరు చెప్పుకుంటాం. చాలాసార్లు మీ కార్యాలయం చుట్టూ తిరిగాం. అదిగో ఇదిగో అన్నారు. ఆరు నెలలు గడిచాయి. అసలు మీ ఉద్దేశం ఏమిటి. మా వీధికి నీరు ఎందుకు రావడం లేదు. ఎంతో ప్రయత్నిస్తే ముంతడు నీరు వస్తుంది. దీంతో రోజంతా ఎలా గడిపేది. మేము పంచాయతీలో ఓటర్లం కాదా. మేము ఇంటి పన్నులు కట్టడం లేదా.. కుళాయి పన్ను కట్టడం లేదా.. మరెందుకు మాకు నీరు ఇవ్వరు..’

మండలంలోని వజ్రంపేటకు చెందిన మహిళలు పంచాయతీ సిబ్బందిని సోమవారం నిలదీసిన తీరు ఇది. ప్రతి నిత్యం నీటికి ఇబ్బంది పడుతుండడంతో అక్కడి మహిళలు సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఆ సమయానికి ఇన్‌చార్జి ఈఓ లేకపోవడంతో సీనియర్‌ అసిస్టెంట్‌ మురళికి తమ సమస్యను వివరించారు. పశువుల ఆస్పత్రి వద్ద కొత్తగా వాటర్‌ ట్యాంకు కడుతున్నారు. అది పూర్తయితే తప్ప మీకు నీరు ఇవ్వలేమని మురళి చెప్పడంతో మహిళలు మరింతగా ఆవేదన చెందారు. ఆ ట్యాంకు ఎప్పటికి పూర్తమవుతుంది.. అప్పటివరకు తామేం చేయాలి.. ఊరొదిలి వెళ్లిపోవాలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అధి కారి స్పందిస్తూ తానేమీ చేయలేనని ఎంపీడీఓను కలవాలని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు.

వజ్రంపేట జంక్షన్‌ వద్ద గతంలో మూడు లక్షలు ఖర్చు చేసి ప్రధాన పైపు లైన్‌కు ఒక వాల్‌ పెట్టారు. కొన్నాళ్లు నీరు కొంత మేరకు వచ్చేది. ఆరునెలల కిందట వజ్రంపేట పక్క వీధుల వాళ్లు తమకు నీరు రావడం లేదని ఆ వాల్‌ రూట్‌ మార్చారు. అప్పటి నుంచి తమకు నీరు రావడం లేదని మహిళలు తెలిపారు. ఇళ్లకు కుళాయిలు ఉన్నా దిష్టిబొమ్మలా మారిపోయాయని తెలిపారు.

ఇంటి పన్నులు కడుతున్నాం. నీటి పన్ను కడుతు న్నాం. మాకు ఎందుకు తాగడానికి నీరు ఇవ్వరు. గతంలో ఒకసారి పంచాయ తీ కార్యాలయానికి వచ్చాం. వారం రోజులు కొంత నీరు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది. – షేక్‌ ఫాతిమా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement