టెక్కలి ఆర్డీఓ తీరుపై మండిపాటు | - | Sakshi
Sakshi News home page

టెక్కలి ఆర్డీఓ తీరుపై మండిపాటు

Jun 30 2026 12:31 AM | Updated on Jun 30 2026 12:31 AM

టెక్కలి ఆర్డీఓ తీరుపై మండిపాటు చక్రతీర్థ స్నానాలు వర్షాల కోసం కప్ప యాత్ర జిల్లా రుణ ప్రణాళిక ఆవిష్కరణ

టెక్కలి: టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి తీరుపై కొంత మంది ఫిర్యాదుదారులు మండిపడ్డారు. సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టుకు సంబంధించి పీడీఎఫ్‌లు అందలేదంటూ జీరు జయలక్ష్మి, జీరు రమేష్‌, జీరు హైమావతి, జీరు అశోక్‌, జీరు నారాయణరావు, నాగేశ్వర్రావు, తిరుపతిరావు తదితరులు సోమవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో విన్నవించేందుకు వచ్చారు. అయితే తమ విన్నపాన్ని స్వీకరించే విషయంలో ఆర్డీఓ తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. తమ బాధలను చెప్పుకోవడానికి వస్తే ఆర్డీఓ చాలా హీ నంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యకర్తలుగా ఉన్నప్పటికీ తమ పై వ్యవహరించిన తీరు ఎంతో ఇబ్బంది కలిగిందంటూ వాపోయారు.

జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుని చక్రతీర్థ స్నానాలు పుణ్య వంశధార నదిలో ఘనంగా జ్యేష్టమాసం సోమవారం జరిగాయి. పార్వతీ పరమేశ్వరులను చక్కగా అలంకరించి పల్లకిలో ఆశీనులుగా చేశారు. అనంతరం వంశధార నదిలో స్వామివారి సహిత వారాహి అమ్మవారికి పుణ్య చక్రతీర్థ సాన్నాలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో యథాస్థానంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో స్వామివారి పాంచరాత్రి కల్యాణ ఉత్సవాలు ముగిశాయి.

జి.సిగడాం: కప్ప..కప్ప నీలాలు, కండవ నిండా వర్షాలు, కురవాలి వానదేవుడా, వానమ్మ వానమ్మా ఒక్క సారి వచ్చిపోవమ్మా.. రైతుల కష్టాలు తీర్చేవా రావమ్మా.. అంటూ మండల పరిధిలోని వెలగాడ, గొలుసుపూడిపేట గ్రా మాల్లో రైతులు, యువకులు, విద్యావంతులు కప్పయాత్ర చేశారు. కప్పను కావిడిలో ఊరేగిస్తూ ఇంటింటికి తీసుకువెళ్లి పసుపు, కుంకుమ, బిందెలతో నీరు తెచ్చి పూజలు చేశారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో సమగ్ర ఆర్థికాభివద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపా ధి కల్పన, స్వయం ఉపాధి రంగాలకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన జిల్లా రుణ ప్రణాళిక మొత్తం పరిమాణం రూ.19,735.42 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలోని రూ.15,576.44 కోట్లతో పోలిస్తే రూ.4,158.98 కోట్ల (26.70 శాతం) పెరుగుదల నమోదైందని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement