తీవ్రంగా అవస్థ పడుతున్న గిరిజనులు
ఎన్నోసార్లు చెప్పాం..
మందస: సోమవారం సంత.. వందలాది వ్యాపారులు, వేలాది మంది గిరిజనులకు ఆధారం. మందస చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు ప్రజలు ప్రతి వారం ఇక్కడకు వచ్చి సరుకులు కొనుగోలు చేసుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సంతలో మలమూత్ర విసర్జనకు ఆరుబయటకే వెళ్లాల్సిన దీనస్థితి ఉంది. ఇదివరకు ఈ గ్రామానికి కనీసం బస్టాండ్ సదుపాయం కూడా లేదు. ఎన్నో దశాబ్దాల నిరీక్షణ తర్వాత వైఎస్సార్‌సీపీ హయాంలో రోడ్లు విస్తరించి బస్టాండ్ సదుపాయం కల్పించడంతో బస్సు కోసం దుకాణాల ముందు దీనంగా నిలబడే దుస్థితి తప్పింది. అప్పుడే స్థానికులు మందస అభివృద్ధి కమిటీ పేరిట ముందుకు వచ్చి మరుగుదొడ్లు ఏర్పాటు చేయగా దానికి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించారు. మందసకు వచ్చే వారికి ఇవి ఉపయోగకరంగా ఉండేవి. కానీ కాలక్రమేణా అవి పాడైపోవడంతో సమస్య మొదటికి వచ్చింది. సంతకు వేలాదిగా గిరిజన ఆడపడుచులు వస్తారు. వీరి అవసరాలకు ఆరుబయటకు వెళ్లాల్సి రావడం అత్యంత బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
మందసలో సమస్యల గురించి ఎన్నోసార్లు చెప్పినా ఎవ రూ పట్టించుకోవడం లేదు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
– కంచి బెహరా, ఎంపీటీసీ సభ్యుడు, మందస


