శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో ఆదివారం వేకువజామున అలజడి సృష్టించిన చైన్ స్నాచ ర్లు పోలీసులు మేలుకునేలోపే ఉడాయించారు. ఆదివారం రాత్రి 11 గంటలకు రెండో పట్టణ ఎస్‌ఐ హేమంత్‌కళ్యాణ్ ఐతమ్ కాలేజీ వైపు ఉన్న సర్వీసు రోడ్డు తుప్పల్లో దొంగిలించిన బైక్‌ను పట్టుకోగలిగారు. ●ఈ దుండగులు ఆ దివారం వేకువజామున 3:22 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి బయటకు వచ్చారు. ●3.42కు నీలమ్మగుడి సమీపంలో నివాసముంటున్న వ్యాపారి మరుపల్లి సీతారాం ఇంటి ముందున్న పల్సర్ 250 మో డల్ బైక్ చోరీ చేశారు. ●ఈ బైక్‌తో 5.03కు కార్గిల్ పార్క్ నుంచి 5.30 గంటలకు పెదపాడు వరకు వరుసపెట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. ●ఈ విషయాలు పోలీసులకు తెలిసే లోపే జంప్ అయ్యారు. ●5:40 గంటలకు మడపాం టోల్‌ప్లాజా దాటి న దుండగులు 5.53కే 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్కలి ఐతమ్ కాలేజీ వద్ద తేలారు.
సీసీ కెమెరాలు ఫెయిల్ : ఐతమ్ కాలేజీ వైపున్న రోడ్డులోకి చేరి తుప్పల్లో బైక్‌ను పడేశారు. సమీపంలో సీసీ కెమెరా ఉన్నా పనిచేయకపోవడంతో వారు బస్సు లో వెళ్లారా.. మరే ఇతర వాహనంలో వెళ్లారా.. అన్నది తెలియరాలేదు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కూడా కెమెరాలు పనిచేయకపోవడంతో ఎటు నుంచి వచ్చారన్నది తెలియలేదు.
ఆ గ్యాంగుల పనేనా..?
ఆదివారం నాడే విశాఖ, అనకాపల్లిలో వరుస చైన్‌స్నాచ్‌లు జరగడంతో ఆ గ్యాంగు లోని సభ్యులే జిల్లాలో ఎంటరై ఉంటారని అనుమానిస్తున్నారు. వీరు యూపీ, వెస్ట్‌బెంగాల్, రాజస్థాన్, బీహార్‌కు చెందినవారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.


