●ప్రతి నెలా క్రైమ్ మీటింగ్‌లో ఎస్పీ.. నిఘా పెంచండి.. రాత్రి గస్తీ పటిష్టంగా అమలు చేయండి అని ఇస్తున్న
ఆదేశాలు బేఖాతరవుతున్నాయా..!
●శ్రీకాకుళం నగరంలో ఆదివారం
పోలీసుల పెట్రోలింగ్ ఉందా..!
ఉంటే ఒక్క చోట కాకపోయినా మరొక్క చోటైనా పోలీసుల నిఘాకు నిందితులు చిక్కేవారు.
●నిఘా నీడలో నగరం అంటూ ఊదరగొడుతున్న పోలీసులు
సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో.. లేదో పరిశీలించాల్సిన అవసరం లేదా..!
●వజ్రపుకొత్తూరు మండలంలో రెండు రోజుల క్రితం రెండు చైన్ స్నాచింగ్‌లు నమోదయ్యాయి.
అంతర్రాష్ట్ర గ్యాంగులకు ఇది పరిపాటిగా మారింది. ఆ నేపథ్యంలోనైనా పోలీస్ వర్గాలు అప్రమత్తమై ఉంటే
ఈ పరిస్థితి ఉండేదా..!
●అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సీసీ కెమెరాల మోనిటరింగ్‌పై ఎప్పుడైనా దృష్టి సారించారా..!


