మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

Jun 30 2026 12:31 AM | Updated on Jun 30 2026 12:31 AM

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

గార: మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది శ్రీకూర్మం పంచాయతీ వెలమవీధికి చెందిన సాధు లక్ష్మణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. లక్ష్మణరావు (46) గత కొన్నేళ్లు గా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం చెరువులో పడి చనిపోతానని చెప్పి బయటకు వెళ్లడంతో గ్రామస్తులు వెతికి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లిపోయాడు. సమీపంలోని సత్రం వద్ద భద్రం పంతులు మేడ మీద మునగ చెట్టుకు తన తువ్వాలుతో ఉరివేసుకున్నాడు. పనిమనిషి మేడమీదకు వెళ్లే సమయంలో చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. భార్య సుమంగళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సీహెచ్‌. గంగరా జు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement