నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు మీకోసం డాట్‌ ఏపీ డాట్‌ జివో వి డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకో వచ్చని తెలిపారు. జిల్లా పరిషత్‌ పాత సమా వేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్‌ ఉంటుందని, ప్రజలు గమనించి రెవెన్యూ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శ్రీముఖలింగంలో ఘనంగా మైనాకోత్సవం

జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్టమాసం ఐదో ఆదివారం స్వామికి మైనాకోత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి ముందుగా హోమం బలిహరణ అనంతరం పార్వతి పరమేశ్వరులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వివాహ మహోత్సవం నచ్చని మైనాకుడు స్వామివారి గృహాన్ని దహనం చేస్తాడు. కార్యక్రమాన్ని మైనాకోత్సవంగా నిర్వహించడం సంప్రదాయంగా పరగణిస్తారు.

పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం

ఎచ్చెర్ల: ఏపీ పాలిసెట్‌–2026 కౌన్సిలింగ్‌ ప్రక్రియలో భాగంగా వెబ్‌ ఆప్షన్ల నమోదు నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసినప్పుడు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వెబ్‌ ఆప్షన్లు నమోదు సమయంలో ఉపయోగించే మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా అభ్యర్థి లేదా వారి తల్లిదండ్రు లది ఉండాలి. ఓటీపీలను ఇతరులతో పంచుకోకూడదు. ఒకసారి వెబ్‌ ఆప్షన్లను ఫ్రీజ్‌ చేసిన తర్వాత వాటిని తిరిగి మార్చడం, తెరవడం సాధ్యం కాదు. హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో కూడా ఓపెన్‌ చేయడం సాధ్యం కాదు. కాబట్టి అన్ని ఆప్షన్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్ర మే ఫ్రీజ్‌ చేయాలి. వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయ డానికి ముందు కళాశాలలు, కోర్సులను తమ ప్రాధాన్యత క్రమంలో ఒక కాగితంపై ముందుగా రాసుకుని అనంతరం అదే క్రమంలో వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌లో మార్పు అవసరమైతే అభ్యర్థి సంబంధిత హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను సంప్రదించి, అవసరమైన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, వాటి సెట్‌ జిరాక్స్‌ ప్రతులను సమర్పించాలి.

పునరావాస కాలనీలో పనులు

సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం పునరావాస కాలనీలో పంచాయతీ అధికారులు పనులు చేపట్టారు. ‘ఎవరికి చెప్పినా ఏం లాభం’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. సెలవు రోజు అయినా పనులను చేపట్టారు. విద్యుత్‌ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేసి గ్రామానికి వెలుతురు తెచ్చారు. నిల్వ ఉన్న మురికినీటిని మళ్లించారు. గ్రామాల్లో ఉన్న ఆలయాలకు పునరావాస కాలనీలో 13 సెంట్లు కేటాయించామని తహసీల్దార్‌ హేమసుందర్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement