సీసీ కెమెరాలో ఏముంది..? | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలో ఏముంది..?

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

సీసీ కెమెరాలో ఏముంది..?

● పోలీసులు నగరంలోని అన్ని సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఆర్టీసీ కాంప్లెక్సు బయట వేకువజాము 3.20 గంటలకు అగంతకులు కదలికల దృశ్యాలు కనిపించాయి. తర్వాత ఒకటో పట్టణ పరిధి కార్గిల్‌ పార్క్‌ సమీప నీలమ్మగుడి వద్ద ఓ బైక్‌ను దొంగిలించినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అదే బైక్‌పై సమీపంలోనే మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న చిల్లా రేణుకాదేవి మెడలోంచి చైన్‌ తెంపేసి చేతులతో అగంతకుడు పట్టుకెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆమె ఫిర్యాదు సైతం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు.

● కార్గిల్‌ పార్క్‌ నుంచి ప్రకాష్‌బాబు ఓల్డ్‌బుక్‌షాపు మీదుగా శివజ్యోతి మెస్‌ పక్కనే ఉన్న బలిజేపల్లివారి వీధి ఎంటరై విజయ్‌ రెసిడెన్సీ ఎదురుగా వున్న సందు చివరకి వెళ్లారు. బోయిన గోవిందరావు భార్య సూర్యకుమారి ఇంటి ముందు వాకిలి ఊడ్చుతుండగా అగంతకులిద్దరూ బండిపై వచ్చి చూసి వెళ్లిపోయి మళ్లీ వచ్చి ఆమె తో మాట కలిపినట్టు నటించాడు. అంతలోనే మరో వ్యక్తి వచ్చి 3 తులాల పుస్తెల తాడు తెంపేశాడు. 2 పుస్తెలు, సతుమానం భాగం ఆమె చేతిలోనే ఉండిపోగా మిగతా రెండుతులాల తాడు పట్టుకుపోయారు. అక్కడి నుంచి నేరుగా ప్రకాష్‌నగర్‌ చేరి మహలక్ష్మినిలయం మలుపులో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న రేగి లక్ష్మి మెడలో పుస్తె తెంపేశారు.

● ఘటనాస్థలికి రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు, ఎస్‌ఐ హేమంత్‌కళ్యాణ్‌, ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణలు వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించి నగరంలో సీసీ పుటేజీలు పరిశీలించారు.

● ఇందులో ఉదయం 5.16 గంటల నుంచి 5.22 గంటల వరకు సీసీ పుటేజీ కనిపించకపోవడం గమనార్హం. అగంతకులు మడపాం టోల్‌ ప్లాజా దాటినట్లు కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి.

దారి కాచి దోపిడీ

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని ఖాజీపేట పంచాయతీ పరిధిలో ఆదివారం వేకువజామున దారి దోపిడీ జరిగింది. అదే గ్రామానికి చెందిన పంచిరెడ్డి అప్పలనాయుడు శ్రీకాకుళం నుంచి తన ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు వచ్చి అప్పలనాయుడుపై దాడి చేసి అతడి జేబులో నుంచి రూ.20వేలు నగదు పట్టుకొని పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement