ఆ రెండు చుక్కలే శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

ఆ రెండు చుక్కలే శ్రీరామరక్ష

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌

అరసవల్లి: పోలియో నిర్మూలన లక్ష్యంగా వరుస గా మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో మారుమూల ప్రాంతంలో చిన్నారికి కూడా పోలియో డ్రాప్స్‌ ఇచ్చేలా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఆదేశించారు. ఆదివారం స్థానిక నగరంలో హౌసింగ్‌ బోర్డు కాలనీలో అంబేడ్కర్‌ భవన్‌ వద్ద పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ కె.అనితతో కలి సి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 0–5 వయస్సు గల చిన్నారులు 1,80,879 మందికి తప్పనిసరిగా ఈ పోలియో చుక్కలు వేయించాలని, ఈ మేరకు కొండ ప్రాంతాలతో పాటు వలసదారుల పిల్లలకు కూడా ఈ డ్రాప్స్‌ వేయించాలన్నారు. ఈ రెండు చుక్కలే భవిష్యత్‌కు శ్రీరామరక్ష అని అన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.అనిత మాట్లాడుతూ జి ల్లాలో మొత్తం 30 మండలాల్లో అన్ని మారు మూల ప్రాంతాలను కూడా కవర్‌ చేస్తూ పోలియో డ్రాప్స్‌ వేయించేలా మొబైల్‌ బృందాలను నియ మించామన్నారు. మొత్తం 1096 పోలియో బూత్‌లలో మొత్తం 7430 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. అనివార్య కారణాలతో పోలియో డ్రాప్స్‌ వేయించుకోలేని వారి కోసం 29, 30 తేదీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement