ఎప్పుడెప్పుడు..? | - | Sakshi
Sakshi News home page

ఎప్పుడెప్పుడు..?

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

● ఆదివారం ఉదయం సరిగ్గా 5.03 గంటలు. జిల్లాకేంద్రంలోని ఒకటో పట్టణ పీఎస్‌ పరిధి కార్గిల్‌ పార్క్‌ ప్రాంతం. ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన చిల్లా రేణుకాదేవి మార్నింగ్‌వాక్‌ చేస్తుండగా ఆమెకు ఎదురుగా గుర్తు తెలియని ఇద్దరు అగంతకులు ద్విచక్రవాహనంపై వచ్చి చైన్‌ తెంపబోయారు. ఆమె ప్రతిఘటించడంతో పారిపోయారు.

● 5.16కు రెండో పట్టణ పరిధి బలిజేపల్లివారివీధిలో బోయిన సూర్యకుమారి, 5.28 గంటలకు ప్రకా ష్‌నగర్‌ మహలక్ష్మి నిలయం మలుపులో రేగి లక్ష్మి మెడల్లోంచి మొత్తంగా 4 తులాల పుస్తెల తాడులు తెంపుకుపోయారు.

● కేవలం అరగంట వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement