శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవో కార్యాలయం వద్ద క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సంఘ భవనంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ అధికారిగా బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎలక్షన్ అధికారిగా బి.నవీన్‌కుమార్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా ఎస్.శంకరరావు (సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్), సెక్రటరీగా ఎ.తారకేశ్వరరావు (అగ్రికల్చర్), కోశాధికారిగా టి.సీతారాం (కమర్షియల్ టాక్స్), అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కె.చంద్రమౌళి (రెవెన్యూ), ఉపాధ్యక్షులుగా జి.నాగమణి (డీఎంహెచ్‌వో ఆఫీస్), పి.సుబ్రహ్మణ్యం (ట్రెజరీ), బి.లక్ష్మి(డీఎంహెచ్‌వో ఆఫీస్), సంయుక్త కార్యదర్శులుగా జై.రవికుమార్ (కమర్షియల్ టాక్స్), ఎ.పద్మావతి (అగ్రికల్చర్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.శ్రీనివాసరావు (రెవెన్యూ), లీగల్ అడ్వైజర్‌గా సీహెచ్ ఉమాశంకర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బల్లాడ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోమ్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.3వేలు, మెమెంటో, సర్టిఫికెట్, ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపీనాథ్ రెడ్డి తరఫున రూ.2వేలు, గిఫ్ట్ ఓచర్, సర్టిఫికెట్ అందించారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ నాయకులు దుక్క రాజశేఖరరెడ్డి, బాకీ వేణుగోపాల్‌రెడ్డి, గౌరవ సలహాదారులు బుచ్చ రామకృష్ణారెడ్డి, దూడ విష్ణుమూర్తిరెడ్డి, పాల వసంత రెడ్డి, బళ్లాడ హేమమాలిని రెడ్డి, పడపాన సుగుణారెడ్డి, మునకాల కిరణ్ కుమార్‌రెడ్డి, అలపాన త్రినాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాత పెన్షన్ మంజూరుకు కృతజ్ఞతలు
శ్రీకాకుళం అర్బన్: డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 అనుసరించి పాత పెన్షన్ మంజూరు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించినందున కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ ఎన్‌జీవో సంఘ పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తమనాయుడు అన్నారు. ఆదివారరం శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో డీఎస్సీ–2003 ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ ఒకటి ముందు నియామక ప్రక్రియలు పూర్తిచేసుకుని కొన్ని కారణాల వల్ల సీపీఎస్ విధానంలోకి నెట్టవేయబడిన డీఎస్సీ 2003 ఉపాధ్యాయులు, కొంతమంది పోలీస్ కానిస్టేబుళ్లు, గ్రూప్–2 అధికారులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11,715 మందికి ఉపశమనం లభించిందన్నారు. సమావేశంలో ఎన్‌జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పూజారి జానికిరాం, బడగల పూర్ణచంద్రరావు, రాష్ట్ర కన్వీనర్ బలగ శ్రీనివాసరావు, జిల్లా కో–కన్వీనర్లు గురుబెల్లి భాస్కరరావు, దుప్పల శివరాం ప్రసాద్, కొత్తపల్లి ప్రకాష్, శ్రీకర్, అట్టాడ తిరుమలేశ్వరరావు, గురుగుబెల్లి చిన్ని కృష్ణంనాయుడు, చదువుల టార్జాన్, దుంపల అనిల్, కె.రామకృష్ణ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ సభకు
సహకరించండి
శ్రీకాకుళం అర్బన్: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూలై 12న శ్రీకాకుళంలో జరగనున్న మొదటి ఉద్యమ సన్నద్ధత సభ విజయవంతం చేసేందుకు సహకరించాలని జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు నేతృత్వంలోని బృందం ఆదివారం ఎన్‌జీజీవో అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణులను కోరారు. సభకు తప్పకుండా హాజరు కావాలని విన్నవించారు. దీనిపై సాయిరాం స్పందిస్తూ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు.


