పైడిగాం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పైడిగాం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

సోంపేట: నియోజకవర్గంలో ఏకై క మైనర్‌ నీటిపారుదల ప్రాజెక్టు పైడిగాం ప్రాజెక్టు పార్టీలకు అతీతంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని వైఎస్సార్‌ సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘పైడిగాంకు పోదాం’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. బేసిరామచంద్రాపురం నుంచి స్థానిక రైతులు, పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా పైడిగాం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ సుమారు 63 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకునే దశకు వచ్చిందన్నారు. తిత్లీ వంటి తుఫాన్లు సంభవిస్తే స్థానిక రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వం , ప్రజా ప్రతినిధులు స్పందించి పైడిగాం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పునఃనిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒడిశా రాష్ట్రంతో నీటి సరఫరాకు ఎటువంటి ఒప్పందాలు లేకపోవడంతో అక్కడి ప్రభుత్వం మహేంద్ర తనయ నదిపై అవసరాలకు మించి ఆనకట్టలు నిర్మించి దిగువ ప్రాంతానికి నీరు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ విషయమై జిల్లాకు చెందిన కేంద్రమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక విప్‌ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పైడిగాం ప్రాజెక్టు సుమారు 17 కిలోమీటర్ల ప్రధాన కాలువలో 10 కిలోమీటర్లు మాత్రమే సిమెంట్‌ గోడ నిర్మాణం జరిగిందని, మిగతా కాలువకు గోడ నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. గన్ని పద్మనాభం సమితి అధ్యక్షుడిగా ఒక్కసారే పనిచేసి తన కృషితో మూడు మండలాల రైతులకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. 15 ఏళ్లపాటు స్థానిక ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ నియోజకవర్గానికి ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. పైడిగాం ప్రాజెక్టుకు గన్ని పద్మనాభం ప్రాజెక్టుగా పేరు మార్చడంతో పాటు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్‌ మట్లాడుతూ రాష్ట్రంలోసాగు నీటి ప్రాజెక్టుల కోసం సాగు చేసే ఖర్చులో ఒక్క శాతం కూడా నియోజకవర్గానికి విడుదల చేయకపోవడం దురదృష్టకరమన్నారు. దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే వహించాలన్నారు. ఎంపీపీ డాక్టర్‌ నిమ్మన దాస్‌ మాట్లాడుతూ అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు కృషితో సుమారు రూ.14 కోట్ల నిధులతో 10 కిలోమీటర్ల మేర కాలువకు సిమెంట్‌ గోడ నిర్మించారని, తిత్లీ తుఫాన్‌ సమయంలో అప్పటి నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిగాయని గుర్తు చేశారు. కంచిలి ఎంపీపీ పైల దేవదాస్‌ రెడ్డి, కంచిలి మాజీ ఏఎంసీ చైర్మెన్‌ బతకల మోహనరావు మాట్లాడుతూ నిధులు మంజూరుపై రెండేళ్లుగా ప్రకటనలు ఇవ్వడం తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తడక యశోద, పార్టీ నాయకులు తడక జోగారావు, ఇప్పిలి కృష్ణారావు, శిలగాన భాస్కరరావు, వజ్జ మృత్యుంజయం, రౌతు విశ్వనాథం, బుద్దాన శ్రీకృష్ణ, మడ్డు వెంకటరావు, సల్ల దేవరాజు, నర్తు భాను, గురాల శ్రీను, తామాడ బుజ్జి, రాజేష్‌ ఖన్నా, టి.ధర్మారావు, దున్న మాధవరావు, సకలాబత్తుల హరీష్‌, పిన్నింటి ఈశ్వరరావు, తామాడ పద్మావతి, పోకల హేమరాజు, బతకల సతీష్‌, కె.శ్రీనివాసరావు, ఎం.సిసింద్రీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement