హైస్కూల్‌ టీచర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

హైస్కూల్‌ టీచర్‌ ఆత్మహత్య

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

పలాస: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జె.రోహిణి (39) అనారోగ్య కారణాల వల్ల తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం తూముకొండ గ్రామానికి చెందిన రోహిణి కాశీబుగ్గలోని మారుతీనగర్‌లో ఒంటరిగా ఉంటున్నారు. భర్త జీవనరావు విజయనగరంలోని జీఎస్టీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. భర్త వారానికి ఒక రోజు వస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి వచ్చేసరికి తలుపు మూసి ఉంది. పక్కింటి వారి సహకారంతో తలుపులు పగలు గొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి రోహిణి ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వెంటనే శనివారం రాత్రి 10 గంటల సమయంలో సీఐ రామకృష్ణ వచ్చి పరిశీలించారు. ఆదివారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిణికి కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సీఐ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement