9 కేసుల్లో రూ.1.50 లక్షల జరిమానా | - | Sakshi
Sakshi News home page

9 కేసుల్లో రూ.1.50 లక్షల జరిమానా

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

9 కేసుల్లో రూ.1.50 లక్షల జరిమానా ‘భూగర్భ జలాలు పెంపొందించాలి’ ‘సంఘటిత పోరాటం తప్పనిసరి’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆహార భద్రతా ప్రమాణాల అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండబోదని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన హోటళ్లు, స్వీట్‌ షాపులు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లపై నమోదైన కేసులను శనివా రం జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో విచారించి మొత్తం 9 పెండింగ్‌ కేసులను పరిష్కరించారు. ఈ కేసుల్లో ఆహార భద్రతా నిబంధనలను పాటించని ఆహార వ్యాపార నిర్వాహకులకు మొత్తం రూ.1,50,000లు జరిమానా విధించా రు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి చిన్న, పెద్ద ఆహార వ్యాపార సంస్థ చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ కలిగి ఉండాల ని, లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు నిర్వహించ డం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే సంబంధిత లైసెన్సులను కూడా రద్దు చేస్తామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ లక్ష్మినారాయణ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కె.లక్ష్మి, జి.శ్రీరాములు ఉన్నారు.

రణస్థలం: చెరువులకు అనుసంధానంగా ఉన్న కాలువలను బాగు చేయించాలని రాష్ట్ర భూగ ర్భ జల డైరెక్టర్‌ కేఎస్‌ శాస్త్రి అన్నారు. మండలంలోని కొండములగాం పెద్ద చెరువు పనుల ను, కొండ కిందకు వచ్చే కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు, బావుల్లో ప్రసుత్త నీటిమట్టం ఏ స్థాయిలో ఉంది. వర్షాలు పడిన తర్వాత ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టమైన నివేదిక తయా రు చేసి పంపించాలని ఉపాధి హామీ సిబ్బంది ని ఆదేశించారు. కాలువలు బాగు చేయడం వల్ల రైతులు పంట పొలాలకు నేరుగా మళ్లించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీడీ ఎన్‌వీకే దుర్గాప్రసాద్‌, ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు, ఏపీఓ ఎం.శ్రీనివాసనాయుడు ఉన్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలు తప్పనిసరిగా మారాయని ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు బీవీఏ రాజు తెలిపారు. జూలై 12వ తేదీన జరిగే మొదటి ఉద్యమ సన్నద్ధం సభ విజయవంతం చేయడానికి అన్ని శాఖల ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగుల మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌, డిసేబుల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌ డీఆర్‌డీఏ, డ్వామా ఎంపవర్‌మెంట్‌, ఏపీఈడబ్ల్యూడీసీ శాఖల ఉద్యో గులను కలిసి మద్దతు కోరారు. వారంతా మద్ద తు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా మహి ళా విభాగం చైర్‌ పర్సన్‌ కె.ప్రవల్లిక ప్రియ, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి డి.సోనికిరణ్‌, జాయింట్‌ సెక్రటరీలు కె.రాధిక, ఎం.గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement