సూక్ష్మకళ.. అబ్బురపరిచేలా! | - | Sakshi
Sakshi News home page

సూక్ష్మకళ.. అబ్బురపరిచేలా!

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

● గాజు సీసాల్లో చెక్కతో కళాకృతులు

● టెక్కలి కార్పెంటర్‌ సోమేశ్వరరావు నైపుణ్యం

టెక్కలి : ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసేవారని గొప్పగా చెప్పుకునే వారు. ఆధునికీకరణ, సరైన ప్రోత్సాహం లేకపోవడం, ఇతరత్రా కారణాలతో ఎంతోమంది అద్భుత కళాకారులు కనుమరుగైపోయారు. ఇలాంటి పరిస్థితిలో టెక్కలి మెట్టవీధికి చెందిన కార్పెంటర్‌ సింహాద్రి సోమేశ్వరరావు తన సూక్ష్మ కళా నైపుణ్యంతో వివిధ రకాల ఆకృతులను తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. చిన్నతనం నుంచి సూక్ష్మ కళపై ఉన్న ఆసక్తిని అభిరుచిగా మార్చుకున్నారు. కార్పెంటర్‌ పని ముగిశాక తీరిక వేళల్లో సూక్ష్మ కళాకృతులను తయారుచేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.

సీసాలో మంచం నుంచి స్టాండ్‌ వరకు...

సోమేశ్వరరావు తన సూక్ష్మ కళావిద్యతో గాజు సీసాలో మంచం, గాజుల స్టాండ్‌, నెయిల్‌ పాలిష్‌ సీసాలో స్వస్తిక్‌ ముద్ర, టూత్‌ పిక్‌తో గొలుసు తదితర వస్తువులను తయారు చేశారు. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందజేస్తే మరిన్ని అద్భుతమైన కళా కృతులు తయారు చేయడమే కాకుండా మరికొందరికి శిక్షణ అందజేస్తానని సోమేశ్వరరావు చెబుతున్నారు.

టూత్‌ పిక్‌తో

రూపొందించిన గొలుసు

గాజు సీసాలో గాజుల స్టాండ్‌

గాజు సీసాలో మంచం కళాకృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement