మాజీ సైనికుల ఔదార్యం | - | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుల ఔదార్యం

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా పరిషత్‌ సమీపంలోని కంపోస్టు కాలనీలో అనాథ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించేందుకు డిస్ట్రిక్ట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ ఫెడరేషన్‌ శ్రీకాకుళం ఆధ్వర్యంలో రూ.21,000ను చెక్‌ రూపంలో అందజేశామని సంఘ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. శుక్రవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ చేతుల మీదుగా వృద్ధురాలికి ఈ సాయం అందించామని చెప్పారు. కార్యక్రమంలో జనరల్‌ సెక్రటరీ పైడి మురళీధరరావు, కోశాధికారి ముదిల సింహాచలం, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ సనపల రామకృష్ణ, హానరరీ ప్రెసిడెంట్‌ సవర లక్ష్మణరావు, అడ్వైజర్‌ పైడి రామారావు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు బోర రాంబాబు, బట్న కామేశ్వరరావు, సిక్కోలు సైనికుడు నర్సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement