రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఇచ్ఛాపురం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం సమీపంలో సుర్లా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన నిరంజన్‌ మహరణ(48) మృతిచెందాడు. ఒడి శా నుంచి ఇచ్ఛాపురం వస్తుండగా గుర్తు తెలి యని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నిరంజన్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం బరంపురం తరలించినా ఫలితం లేకపోయింది. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. నిరంజన్‌ పట్టణంలోని దానంపేటలో ఈ–సేవా కేంద్రం, ఫ్లెక్సీ యూనిట్‌ నిర్వహిస్తున్నాడు. భార్య సుజ్ఞాని, కుమారుడు శుభమ్‌ ఉన్నారు. నిరంజన్‌ మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం కుజ్జిపేట గ్రామ సమీపంలోని తాలిచెరువు గట్టుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గురువారం ఉదయం గ్రామస్తులు ఉపాధి హామీ పనుల కోసం చెరువు గట్టుపై వెళ్తుడగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ టవల్‌ చుట్టి ఉండటం, చెవులు, ముక్కు నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు గుర్తించారు. ఎవరైనా చంపి పడేశారా, ఇంకేదైనా కా రణముందా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటబొమ్మాళి ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అభివృద్ధిపై మాట్లాడే అర్హత అచ్చెన్నకు లేదు

టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో అభివృద్ధిపై మాట్లాడే కనీస అర్హత మంత్రి అచ్చెన్నాయుడు కు లేదని వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్‌ మండిపడ్డారు. ఇటీవల సంతబొమ్మాళి మండలం బోరుభద్రలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తిలక్‌ శుక్రవారం ఘాటుగా స్పందించారు. వారసత్వ రాజకీయాలతో ఎదిగి వేలాది కోట్ల రూపాయలు అవినీతి సంపాదన చేసిన అచ్చెన్నాయుడు ఈ రోజు అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే కుటుంబం రాజకీయ పబ్బం గడుపుతూ నియోజకవర్గంలో ఏ ఒక్క శాశ్వతమైన పథకం తీసుకువచ్చారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న రోడ్లు, జలజీవన్‌ మిషన్‌ పథకాలకు సొంత పేర్లు పెట్టుకుంటున్నారు తప్పా శాశ్వత కార్యక్రమాలు చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం చేస్తున్న జలజీవన్‌ మిషన్‌ పథకం గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతిపాదనలు చేసినవేనని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లలో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారని, దీనిపై దర్యాప్తు చేయిస్తామని తిలక్‌ పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో టెక్కలి నియోజకవర్గంలో మూలపేట పోర్టు నియోజకవర్గ చరిత్రలో తలమానికంగా నిలిచిందన్నారు. నిమ్మాడ గ్రామంలో పీహెచ్‌సీకి రూపకల్పన చేసిన సంగతిని మంత్రి మరిచారని ఎద్దేవా చేశారు. నిమ్మాడ నుంచి చిట్టెయ్యవలస వరకు వైఎస్సార్‌సీపీ హయాంలోనే రోడ్లు వేశారని గుర్తు చేశారు. టీడీపీలో నియంతగా మరొకరికి రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా అవినీతి సంపాదన చేస్తున్న అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని తిలక్‌ హెచ్చరించారు.

పేరాడ తిలక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement