శ్రీకాకుళం: పీఆర్సీ కాల పరిమితి ముగిసి మూడేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యం ప్రకటించకుండా తాత్సారం చేయడం తగదని, ఇందుకు మూల్యం చెల్లించుకోకతప్పదని ఎస్టీయూ సంఘం రాష్ట్ర కార్యదర్శి పడాల అమ్మినాయుడు అన్నారు. ఎస్టీయూ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం శుక్రవారం శ్రీకాకుళంలోని క్రాంతిభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీ వైస్ చైర్మన్ ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి టెట్ అవసరమా ? అని ప్రశ్నించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ వర్క్ అడ్జెస్ట్‌మెంట్ పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయులలో గందరగోళ పరిస్థితి సృష్టిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కంచరాన తేజేశ్వరరావు, మానెం సన్యాసిరావు, పేడాడ రామకృష్ణ, మురళీకృష్ణ, కృష్ణ, కూన కృష్ణారా వు, బొడ్డేపల్లి రమేష్, రామచంద్ర, మొయ్యి తేజేశ్వరరావు, పేడాడ అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు.


