మాదకద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యం

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీసుల లక్ష్యమని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం నుంచి డే అండ్‌నైట్‌ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ రామచంద్రకుమార్‌, సీఐలు పి.ఈశ్వరరావు, వి.రామారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement