మందస: స్థానిక కొర్రాయిగేటు జంక్షన్ వద్ద శుక్రవారం 9 కిలోల గంజాయిని తరలిస్తుండగా సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్ పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పూణెకు చెందిన శ్రీరామ్ జిలేబి షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఒడిశాకు చెందిన రంజాన్ అనే వ్యక్తి తో అతనికి పరిచయమైంది. ఆర్థిక స్థితి బాగోకపోవడంతో రంజాన్ గంజాయి వ్యాపారం గురించి శ్రీరామ్‌కు చెప్పాడు. కానీ శ్రీరామ్ ఆసక్తి చూపించలేదు. వైజాగ్‌లో జిలేబీ వ్యాపారం చేద్దామని వెళ్లి.. అక్కడ అనువుగా లేక విజయనగరం వచ్చాడు. అక్కడ స్కూటీ దొంగతనం చేసి.. అదే స్కూటీతో బరంపురం వచ్చి అక్కడి నుంచి రైలులో పూణె వెళ్లిపోయాడు. అక్కడ వేరే స్నేహితుడితో గంజాయి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. పూణేలోనే ఓ మైనర్‌ను తోడుగా తీసుకువచ్చి 8 ప్యాకెట్ల గంజాయిని గురువారం ఉదయం బరంపురంలో తీసుకున్నాడు. పూణె వెళ్లడం కోసం పలాస రైల్వే స్టేషన్‌కు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.


