శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జూలై 12 వ తేదీన జిల్లాలో జరగను న్న మొదటి ఉద్యమ సన్నద్ధం సభకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంపూర్ణ మద్దతును ఇ చ్చారు. ఈ మేరకు శుక్రవారం ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షులు బీవీఎన్ రాజును రెవెన్యూ వసతి గృహంలో కలిసి ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పెండింగ్ డీఏలను ప్రకటించటం, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్‌ను ప్రకటించడం, సరెండర్ లీవుల మంజూరు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం, కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం రద్దు చేయడం తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నట్లు సచివాలయ ఉ ద్యోగులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జీకే శ్రీనివాసరావు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.


