న్యూస్‌రీల్
పేటలో దాసుకోలేనన్ని గొడవలు
హాట్
టాపిక్
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి ప్రతినిఽధి, శ్రీకాకుళం:
నరసన్నపేట టీడీపీలో గొడవలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎలాగైనా బరిలోకి దిగాలని కేంద్ర రాష్ట్రమంత్రులకు మేనల్లుడు, బావ మరిది వరసైన మెండ దాసునాయుడు ఉవ్విళ్లూరుతున్నారు. తానే ఓ పవర్ సెంటర్‌లా మారాలని తాపత్రయపడుతున్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి మరో ఛాన్స్ రాదనే సంకేతాలతో తెగ హడావుడి చేస్తున్నారు. కానీ బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన ముందు దాసునాయుడు పప్పులుడకడం లేదు. ఆయన వేసే ప్రతి ఎత్తుగడను తిప్పికొడుతున్నారు. దాసుకు అంత సీన్ లేదని తీసి పారేస్తున్నారు. ఆయన చేసే యాక్షన్‌కు చెక్ పెట్టి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల ముందే పరువు తీసేస్తున్నారు. వీరి వ్యవహారం నరసన్నపేట టీడీపీలో రచ్చరచ్చగా మారింది.
నాయుడి షో..
తెలుగు యువత అధ్యక్షుడిగా దాసనాయుడు చేసే షో అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు జిల్లాకు వస్తే అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తారని పార్టీ వర్గాలే అంటుంటాయి. అవతల వ్యక్తుల నుంచి స్పందన లేకపోయినా వారంతా విష్ చేసినట్టు తనకే తాను బిల్డప్ ఇస్తూ హల్‌చల్ చేస్తుంటారు. నలుగురైదుగురిని వెంటేసుకుని, బలమైన నాయకుడిగా, కేంద్రరాష్ట్ర మంత్రుల సొంతమనిషిగా శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గంలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ మధ్య ‘సాక్షి’ కార్యాలయం ఎదుట కూడా ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ కేడర్, తోటి నాయకుల దగ్గర తన మేకపోతు గాంభీర్యం చూపిస్తుంటారని అంటుంటారు.
ఎత్తుకు పై ఎత్తులు
ఈ క్రమంలో తనకో నియోజకవర్గం కావాలని నరసన్నపేటను ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలం పెంచుకుని, అక్కడ పోటీ చేయాలని పావులు కదుపుతున్నారు. చిన్నా చితక నాయకులు, కార్యకర్తలను వెంట బెట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. రెండో పవర్ సెంటర్‌గా అక్కడ షో చేస్తున్నారు. దాసునాయుడు చేస్తున్న యాక్షన్ చూసి ప్రస్తుత ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో పాటు ఆయన కుమార్తె ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. వేసే ప్రతి అడుగును ముఖ్యంగా అర్చన తిప్పికొడుతున్నారు. నువ్వు ఎక్కడేదో చేసుకో.. ఇక్కడ పప్పులుడకవని చేతల ద్వారా చూపిస్తున్నారు. పలుసార్లు అవమానపరిచారు కూడా. ఒక కార్యక్రమంలోనైతే కేంద్ర, రాష్ట్ర మంత్రుల ముందే మెండ దాసునాయుడును ‘యూజ్ లెస్ ఫెలో’ అని అర్చన బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే రకంగా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్లెక్సీలతో డామినేట్ చేద్దామని చూస్తే పీకి పారేశారు.
వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు
నరసన్నపేటలోనే రాజకీయంగా ఎదగాలని తన నియోజకవర్గంలో ఒక ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ పెట్టుబడి ఎక్కడిది అన్నది పక్కన పెడితే అక్కడే ఉండి భవిష్యత్ రాజకీయాలు నెరపాలని ప్లాన్ చేస్తున్నారు. బగ్గు రమణమూర్తిపైన, వారి కుమార్తె పేరున పలువురి వ్యక్తులతో సోషల్ మీడియా వేదికగా దుయ్య బట్టడం, పలు ఆరోపణలు గుప్పించడం వంటివి వ్యూహత్మకంగా జరుగుతున్నాయి. ఇవన్నీ బగ్గు వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. అదే దిశగా దాసునాయుడ్ని లక్ష్యంగా చేసుకుని అటు వైపు నుంచి కౌంటర్లు పడుతున్నాయి. మనోడి సంగతి స్థానిక సంస్థల ఎన్నికల్లో తేల్చేద్దామనే ధోరణిలో ప్రత్యర్థి శిబిరం కూడా వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఆయనకంత సీన్ లేదని, సొంత మండలమైన పోలాకిలోనే నమ్మరని, ఆయన సోదరుడిపై వచ్చిన వసూళ్ల ఆరోపణలు ప్రతి ఒక్కరికీ తెలుసని, అలాంటి వ్యక్తిని నరసన్నపేట ప్రజలు నమ్మరని బగ్గు వర్గం గట్టిగా నమ్ముతోంది. మొత్తానికి బగ్గు వర్సెస్ మెండ రాజకీయ యుద్ధం నరసన్నపేటలో హాట్ టాపిక్‌గా మారింది.
నరసన్నపేట టీడీపీలో అంతర్గత పోరు
పవర్‌సెంటర్‌గా ఎదగాలని మెండ దాసునాయుడు తాపత్రయం
కింజరాపు బంధుత్వాన్ని
వాడుకుంటున్న వైనం
దాసు ఎత్తుగడలు తిప్పికొడుతున్న
బగ్గు ఫ్యామిలీ


