ఘనంగా ఆదిత్యుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆదిత్యుని కల్యాణం

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వా మి వారి కల్యాణ సేవ గురువారం ఉదయం ఘనంగా జరిగింది. నిజ జ్యేష్ట శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను కల్యాణ మూర్తులుగా అలంకరించి అనివెట్టి మండపంలో ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణాన్ని జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో క్రతువు జరిగింది.

‘పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందిద్దాం’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పారదర్శకంగా, అత్యంత కచ్చితత్వంతో ఓటర్ల జాబితా అందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)–2026 ప్రక్రి యపై జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి గురువారం ఆయన ఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఆ తర్వాత వీటిని ప రిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న తుది జాబితాను ప్రచురించడం వరకు ప్రతి కార్యక్ర మం సకాలంలో పూర్తి చేసేందుకు సన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు. బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేయాలని సూచించారు.

28న పల్స్‌ పోలియో

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పోలియో రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యతని, జూన్‌ 28న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ పల్స్‌ పోలియో టీకా కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ సభ్యులు లయన్‌ పొన్నాడ రవికుమార్‌, లయన్‌ నటుకుల మోహన్‌ నేతృత్వంలో రూపొందించిన పోలియో అవగాహన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

బాలుడిపై కుక్కల దాడి

పలాస: కాశీబుగ్గ శ్రీనివాసనగర్‌కు చెందిన పదేళ్ల బాలుడు మడ్డు రోహిన్‌పై కుక్కలు దాడి చేయడంతో గా యాలపాలయ్యాడు. వీధిలో ఆడుకుంటుండగా ఒక్క సారి కొన్ని కుక్కలు అతనిపై దాడి చేశాయి. ఆ సమయంలో స్థానికులు వెంటనే చూసి కుక్కలను త రిమేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. మున్సిపాలిటీలో విచ్చలవిడిగా కుక్కలు తి రుగుతున్నాయని, మున్సిపల్‌ అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మాదకద్రవ్యాలతో జీవితం నాశనం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: డ్రగ్స్‌, మద్యం, ధూమపానం వంటి వ్యసనాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు యు వతకు సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం బలగలోని రిమ్స్‌ వైద్య కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ‘మాదక ద్రవ్యాలు వద్దు – జీవితం ముద్దు’ అనే నినాదంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థుల న్యాయ విజ్ఞానం కోసం లీగల్‌ లిటరసీ క్లబ్‌ ఏర్పాటు చేసి, న్యాయవాదిని, పారా లీగల్‌ వలంటీర్‌ను ని యమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement