నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

నిర్మాణంలో ఉన్న ఇల్లు

వీరభద్రాపురంలో ఉద్రిక్త పరిస్థితి

పలాస: పలాస మండలం వీరభద్రాపురం గ్రామంలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో బమ్మిడి విమలకుమారి అనే ఒక మహిళ ఇల్లు నిర్మించుకుంటున్నారు. శ్లాబ్‌ వరకు వచ్చింది. ఏమైందో ఏమో గానీ గురువారం రాత్రి పలాస తహసీల్దార్‌ బి.శ్రీదేవితో పాటు రెవెన్యూ యంత్రాంగం అక్కడకు వెళ్లి పొక్లెయినర్‌తో ఇంటిని కూల్చివేశారు. స్థానికులంతా మూకుమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ, పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్లి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. పసుపు కుంకుమ కింద బమ్మిడి కృష్ణారావు తన చెల్లెలు విమలకుమారికి ఈ స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో ఆమె ఇల్లు కట్టుకుంటుండగా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అది ప్రభుత్వం భూమి అని, అందులో ఇల్లు క ట్టుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఎ లాంటి నోటీసు లేకుండా అధికారులు ఆగమేఘాల మీద అక్కడకు వెళ్లి ఇంటిని కూల్చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement