గ్రామసభ బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

గ్రామసభ బహిష్కరణ

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

సరుబుజ్జిలి: ఇనాం భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగిస్తామని మాయ మాటలు చెప్పి, భూములను సంబంధం లేని వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను సహించబోమని రొట్టవలస గ్రామానికి చెందిన రైతులు అధికారులను నిలదీశారు. ఈ మేరకు గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన గ్రామసభను రైతులు బహిష్కరించారు. రొట్టవలస గ్రామ పరిధిలో ఇనాం పేరుతో ఉన్న భూములను సుమారు 300 మంది చిన్న,సన్నకార రైతులు 200 ఏళ్లగా సాగు చేస్తున్నారు. వీరికి అడంగల్‌ను అధికారులు ఇవ్వగా రుణాలు, పంట నష్టపరిహారం, భూములు క్రమవిక్రయా లు జరుపుకునే వారమని రైతులు తెలిపారు. అయితే తమ గ్రామంలో సాగుహక్కులో ఉన్న భూములపై తమకు సర్వహక్కులు ఉన్నప్పటికీ తమకు పట్టాలు ఇవ్వకుండా భూములకు సంబంధం లేని మగటపల్లి సాంబమూర్తికి రీసర్వే పే రుతో అధికారులు ధారాదత్తం చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని స్పష్టం చేశారు. దీంతో అధికారులు చేసేది లేక గ్రామసభ నిర్వహించకుండా వెనుదిరిగారు. సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్‌ నళినాక్షి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement