టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 26, 27 తేదీలలో ఆహ్లాద్–2026 పేరిట సాంస్కృతిక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు ఏపీ, తెలంగాణా, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళా ప్రతిభను వెలికితీసేందుకు నృత్యం, సంగీతం, ఫ్యాషన్‌షో, సాహిత్యం, సాంస్కృతిక పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం జరిగే ముగింపు కార్యక్రమాలకు సినీ నటి రాశీసింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.


