శ్రీకాకుళం పాతబస్టాండ్: పల్స్ పోలియో ఈ నెల 28న జరగనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం పల్స్ పోలియో నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం సెలవు దినమైనప్పటికీ పోలియో చుక్కలు వేసేందుకు పాఠశాలలు తెరిచి ఉంచాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ తదితర చోట్ల ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.అనిత మాట్లాడుతూ 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.అనిత, అదనపు డీఎంహెచ్‌ఓ శ్రీకాంత్, డీఐఓ రామదాసు, విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ అటవీ శాఖ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీముఖలింగంలో
కల్యాణోత్సవాలు ప్రారంభం
జలుమూరు: అధిక జేష్ఠ మాసం సందర్భంగా ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో బుధవారం ముఖలింగేశ్వర సహిత వారాహి అమ్మవారి పాంచరాత్రి కల్యాణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ధ్వజారోహణ నిర్వహించి పుణ్యాహవచనం, మంటపారాధన, బలిహారణ అనంతరం మంగళం పలికారు. కార్యక్రమంలో ఈఓ ఏడుకొండలు, పురోహితులు బంకుపల్లి ఫణేంద్రశర్మ, అర్చకులు శేషాద్రి వెంకటాచలం, నాయుడుగారి రాజశేఖర్, నారాయణమూర్తి, శివాజి, సింహాచలం, భక్తులు పాల్గొన్నారు.
పొలంలో మోహన్ మృతదేహం


