పొలంలోనే ప్రాణం వదిలి.. | - | Sakshi
Sakshi News home page

పొలంలోనే ప్రాణం వదిలి..

Jun 25 2026 1:00 AM | Updated on Jun 25 2026 1:00 AM

విద్యుత్‌ షాక్‌తో కౌలు రైతు మృతి

మెళియాపుట్టి: దుర్భలాపురం గ్రామానికి చెందిన రైతు పెద్దింటి మోహన్‌ (55) విద్యుత్‌ షాక్‌కు మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. మోహన్‌ బుధవారం సాయంత్రం గ్రామ పరిధిలోని పొలంలో సారికంద పంటకు నీరు కట్టడానికి వెళ్లాడు. విద్యుత్‌ శాఖ సిబ్బంది ఇటీవల కురిసిన వర్షాలకు తెగిన కరెంట్‌ వైర్లను చుట్టి పొలంలో వేశారు. వాటికి అదే పొలంలోని పంపుషెడ్‌ విద్యుత్‌ తీగ అంటుకుని ఉంది. ఆ విషయం గమనించని మోహన్‌ కరెంట్‌ వైర్లను పక్కకు వేయాలని ప్రయత్నించగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మోహన్‌కు భార్య తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement