● తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించిన ఉపాధ్యాయుడు
మందస: ప్రభుత్వ బడుల్లోని అనుభవం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, కొత్తపల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గవ్వ భీమారావు కోరారు. ఈ మేరకు మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తన చిన్న కుమారుడు గవ్వ తరుణ్‌ను 1వ తరగతిలో చేర్పించారు. పెద్ద కుమారుడు గవ్వ గిరీష్ కూడా అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. దీంతో ఆయనను పలువురు అభినందించారు.


