రేపుతోంది కల్లోలం.. | - | Sakshi
Sakshi News home page

రేపుతోంది కల్లోలం..

Mar 15 2026 1:00 AM | Updated on Mar 15 2026 1:00 AM

రేపుతోంది కల్లోలం.. మామిడి x కలమట ● పాతపట్నం టీడీపీలో అంతర్యుద్ధం ● టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనుల వివరాల కోసం దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే కలమట ● ఎక్కడో చెడిన వ్యవహారం ● పనుల గుట్టు రట్టు చేయాలన్న యోచనలో కలమట ఆర్టీఐ అస్త్రం..

శ్రీకాకుళం మున్సిపల్‌ అధికారులపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం

ముగ్గురు అధికారులు, ఇద్దరు ఎమినిటీస్‌ సెక్రటరీలకు షోకాజ్‌ నోటీసులు

కాకరేపిన ఆర్టీఐ దరఖాస్తు

యుద్ధం రాజేసిన గ్యాస్‌ మంట జిల్లాలో ఆరడం లేదు. కమర్షియల్‌ సిలిండర్ల కొరత ఉండడంతో హొటళ్లు కట్టెలను వినియోగించి వండి వారుస్తున్నాయి. ఈ సదుపాయం లేని వారు హొటళ్లను మూసివేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు హొటళ్లలో ఈ దృశ్యాలు కనిపించాయి. బుకింగ్‌ సెంటర్‌ వద్ద హడావుడి కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, శ్రీకాకుళం
మామిడి x కలమట
● పాతపట్నం టీడీపీలో అంతర్యుద్ధం ● టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనుల వివరాల కోసం దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే కలమట ● ఎక్కడో చెడిన వ్యవహారం ● పనుల గుట్టు రట్టు చేయాలన్న యోచనలో కలమట

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

పాతపట్నం నియోజకవర్గంలో చేస్తున్న పనులపై సందేహాలు ఉన్నాయా? పనుల్లో అక్రమాలు జరిగాయా? నిధుల దుర్వినియోగం జరిగిందా? పనుల్లో గోల్‌మాల్‌ చోటు చేసుకుందా? సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన జిల్లా మాజీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

తీవ్రస్థాయిలో పోరు

చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మధ్య నువ్వానేనా అన్నట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి సాగుతోంది. ఎన్నికల్లో వీరి మధ్య మా టలు తూటాలు పేలాయి. మామిడి గోవిందరావు వ్యవహార శైలిని కలమట వెంకటరమణ ఎండగట్టగా, మాజీ ఎమ్మెల్యే కలమట బాగోతాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తూర్పార పట్టారు. చంద్రబా బు ప్రభు త్వం వచ్చా క కూడా అదే నడుస్తోంది. ఒకరినొకరు టార్గెట్‌ చేసుకుంటున్నారు.

ఆ మధ్య ఇసుక కోసం ఇరువురి మధ్య పోరు నడిచింది. ఇప్పుడేమో నియోజకవర్గంలో చేస్తున్న అరకొర అభివృద్ధి పనులపై వివాదం కొనసాగుతోంది. మంజూరైన పనులు, వాటి ప్రగతి, నిధు లు, బిల్లుల చెల్లింపులు కావాలంటూ సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసేవరకు వ్యవహా రం ముందుకు సాగింది.

ఒకరినొకరు అడ్డుకునే పరిస్థితి

నియోజకవర్గంలో ఉప్పు–నిప్పులా ఇద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా సాగుతోంది. చివరికి, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వేసిన కమిటీల్లో కలమట వర్గీయులకు చోటు దక్కలేదని, అదే సందర్భంలో తటస్థులుగా ఉన్న నాయకులను కమిటీల్లో వస్తే తమకు ఆ పదవులు వద్దంటూ కలమటతో ఉన్న సంబంధాలతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇరువర్గా లు ఎవరి సంపాదన వారిదే అన్నట్టుగా నడుస్తోంది. ముఖ్యంగా ఇసుక విషయంలో ఇరువురి మధ్య పెద్ద వివాదమే నడిచింది. కలమటతో సంబంధం ఉన్న ఇసుక వ్యవహారాలను ఎమ్మెల్యే అడ్డుకోగా, ఎమ్మెల్యేతో సంబంధం ఉన్న ఇసుక నిర్వాకాలను కలమట అడ్డుకున్న పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ప్రతి దాంట్లో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి.

పనుల సంగతేంటి..?

సాధారణంగా అధికార పార్టీ చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు సమాచారం హక్కు చట్టం కింద దర ఖాస్తు చేసి, వివరాలు సేకరించి, లోపాలు, అక్రమా లు, దుర్వినియోగం గుట్టు రట్టు చేస్తాయి. కానీ, ఇక్కడ అధికార పార్టీ చేసిన పనులపై అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఏకంగా సమాచార హక్కు చట్టం కింద దరఖా స్తు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీలో ఉన్న నాయకుడు...అది కూడా మాజీ ఎమ్మె ల్యే, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడైన కలమట వెంకటరమణ అడిగితే వివరాలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించే పరిస్థితి ఉండదు. అడిగిన వెంటనే ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ, అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏకంగా వివిధ కేటగిరీల కింద పనుల వివరాలు ఇవ్వాలంటూ సమాచారం హక్కు చట్టం దరఖాస్తు చేశారు. నియోజకవర్గంలో మెటీరియల్‌ కాంపోనెట్‌ కింద ఎన్ని పనులు మంజూరయ్యాయి? మంజూరైన నిధులు ఎంత? విడు దలైన నిధులెన్ని? చేపట్టి పనుల్లో ఎన్ని పూర్తయ్యా యి? ఎన్ని పనులు కొనసాగుతున్నాయి? ఇంకా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నవెన్ని? గ్రామాల వారీగా పనులేవి? చేసిన పనులకు చెల్లించిన బిల్లు ల ఎంత? ఎంబుక్‌ కాపీల జెరాక్స్‌లు, వెండర్‌ పేరు, వెండర్‌ కోడ్‌ రిజి స్ట్రేషన్‌ వివరాలు

కావాలంటూ ఆ దరఖాస్తులో కోరారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం:

‘మీరంతా సిగ్గు వదిలేసి పనిచేస్తున్నారా... ప్రజలకు మధ్యకు వెళితే వారు చెబుతున్న మాటల కు, చేస్తున్న ఆరోపణలకు సిగ్గు అనిపించడం లేదా .. ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా బాధ్యతగా పనిచేయరా.. ఎలా చెప్పినా మీరు వినే టట్లు లేరు.. ఇక మీదట ఉన్నతాధికారులమే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మున్సిపల్‌ అధికారులు, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నీటి సరఫరా విభాగం ప్రజారోగ్య విభాగంతో పాటు వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కరూ సరైన సమాధానాలు చెప్పలేకపో యారు. వారి దగ్గర రికార్డులు కూడా లేకపోవడంతో కలెక్టర్‌ మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. గడచిన నెల రోజులుగా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తుంటే.. ఇప్పటికి కూడా బాధ్యత మరిచి కొందరు పనిచేస్తు న్నారని ఇకమీదట ఉపేక్షించేది లేదంటూ ముగ్గురు అధికారులు, ఇద్దరు ఎమినిటీస్‌ సెక్రటరీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ కార్యాలయ సి బ్బందితో చెప్పారు. ఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుధీర్‌, నీటి సరఫరా విభాగం ఏఈ సత్యనారాయణ, మరో ఏ ఈ సృజనతోపాటు సెక్రటరీలు శరత్‌, ఉమాలకు షోకాజు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అయితే సమావేశం పూర్తయ్యే సరికి ముగ్గురికి మాత్రమే షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. మిగిలిన ఇద్దరికి ఎందుకు ఇవ్వలేదన్న దానిపై చర్చ జరిగింది.

ఇప్పుడీ ఆర్టీఐ దరఖాస్తు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ చేపట్టిన పనులపై అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సమాచారం హక్కు చట్టం కింద వివరాలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. పనుల్లో అవకతవకలు జరిగాయా? అక్రమాలు చోటు చేసుకున్నాయా? నిధుల గోల్‌మాల్‌ జరిగిందా? బిల్లులు చెల్లింపుల్లో తేడాలున్నాయా? ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఏమైనా సంబంధం ఉందా? అందుకనే మాజీ ఎమ్మెల్యే కలమట సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాత్రం ఇదంతా ప్రభుత్వంపై వేసిన ఆర్టీఐ దరఖాస్తుగా భావిస్తున్నారు, ప్రభుత్వం చేసిన పనులతో తనకు పేరు వచ్చిందన్న అక్కసుతో కుట్రపూరితంగా కలమట వ్యవహరించారని మామిడి తేల్చి చెబుతున్నారు. దీంట్లో ఏది వాస్తవమో? సమాచారం హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తు వెనక ఉన్న వ్యూహమేంటో? కలమట తదుపరి అడుగులతోనే తేటతెల్లం కావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement