●కలెక్టర్‌ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

●కలెక్టర్‌ శుభాకాంక్షలు

Mar 15 2026 1:00 AM | Updated on Mar 15 2026 1:00 AM

●కలెక్టర్‌ శుభాకాంక్షలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులందరికీ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో పరీక్ష లు రాయాలని సూచించారు. పదేళ్ల విద్యా ప్రస్థానంలో పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకమైనవని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజ రై, క్రమశిక్షణతో చదివి, మంచి మార్కులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలవాలని కోరారు. పరీక్ష ల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసిందని, కేంద్రాల వద్ద మంచినీరు, విద్యుత్‌ సరఫరా, వైద్య సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement