కండ్రావార్డు హైస్కూల్‌కు ఎన్‌బీటీ పుస్తకాలు | - | Sakshi
Sakshi News home page

కండ్రావార్డు హైస్కూల్‌కు ఎన్‌బీటీ పుస్తకాలు

Feb 6 2026 8:36 AM | Updated on Feb 6 2026 8:36 AM

కండ్రావార్డు హైస్కూల్‌కు ఎన్‌బీటీ పుస్తకాలు

కండ్రావార్డు హైస్కూల్‌కు ఎన్‌బీటీ పుస్తకాలు

ఇచ్ఛాపురం రూరల్‌: మండలంలోని కండ్రావార్డు ఉన్నత పాఠశాలకు భారత ప్రభుత్వం న్యూఢిల్లీ నుంచి విలువైన పుస్తకాలను గురువారం పంపించింది. ఈ సందర్భంగా ఎంఈఓ కురమాన ఆప్పారావు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయురాలు బూరవిల్లి ఉమామహేశ్వరి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురష్కారానికి నామినేట్‌ కావడం జిల్లాకే గర్వకారణమన్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఆమె దేశ వ్యాప్తంగా 154 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో చోటుదక్కించుకున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా పాఠశాల విద్య, సాక్షరత విభాగం ఆధ్వర్యంలో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌బీటీ) పుస్తకాలను బహుమతులుగా అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పుస్తకాలను పాఠశాలలో ప్రదర్శించి హెచ్‌ఎం ఉమామహేశ్వరిని దుశ్శాలువతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement