పల్లె పాట.. భాగ్యనగర బాట! | - | Sakshi
Sakshi News home page

పల్లె పాట.. భాగ్యనగర బాట!

Feb 6 2026 8:36 AM | Updated on Feb 6 2026 8:36 AM

పల్లె పాట.. భాగ్యనగర బాట!

పల్లె పాట.. భాగ్యనగర బాట!

రికార్డింగ్‌ రూమ్‌లో

జానపద పాటలు పాడుతూ..

నటుడు సమీర్‌ చేతుల మీదుగా

నంది అవార్డు

అందుకుంటున్న శ్రీనివాస్‌

ఇచ్ఛాపురం రూరల్‌ : ఇచ్ఛాపురం మండలం బుడ్డేపుపేటకు చెందిన లెంక శ్రీను చిన్నతనం నుంచే పల్లెల్లో పాటలు పాడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఎప్పటికై నా వేదికపైకి ఎక్కి అద్భుత ప్రదర్శనతో అందరితో ప్రశంసలు అందుకోవాలని కలలు కన్నాడు. పల్లె పాటల మాధుర్యమే ఊపిరిగా, కలలే దారిగా.. తన ఊరి మట్టి వాసనను గుండెల్లో దాచుకుని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతూ పదకొండేళ్ల వయసులోనే భాగ్యనగరానికి రైలెక్కి బయల్దేరాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కానీ..కళ్లల్లో మాత్రం ధైర్యం, ఆశల వెలుగు, సినిమాల్లో పాడాలన్న కోరికతో చేసిన ప్రయాణంలో శ్రీనును అక్కున చేర్చుకున్నాడు ప్రముఖ గాయకుడు రసమయి బాలకిసాన్‌. ఆ ఆశ్రయమే శ్రీనివాస్‌ జీవితాన్ని మలుపుతిప్పింది. గాయకుడిగా, కళాకారుడుగా తన ప్రతిభకు పదును పెట్టుకున్నాడు. ‘థూమ్‌ ధామ్‌’ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భీమ్లానాయక్‌, దసరా, బాహుబలి–2, ఇటీవల సంక్రాంతికి విడుదలైన మన శంకర వర ప్రసాద్‌ సినిమాలకు శ్రీనివాస్‌ అసిస్టెంట్‌ క్యాస్టింగ్‌ డైరెక్టర్‌గా పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఐదు వందల జానపద పాటలకు లిరిక్స్‌ రైటర్‌గా తన కలాన్ని ఝులిపించిన శ్రీనివాస్‌.. శివ కళ్యాణ్‌ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘తురుమ్‌ ఖాన్‌లు’ చిత్రానికి ఆరు పాటలు రాశాడు. అంతే కాకుండా యూట్యూబ్‌లో ప్రాచుర్యం పొందిన ‘బెంగాలీ రసగుళ్ల’, ‘చికెనీ తెస్తాడు నా అల్లుడు’, ‘రాను బొంబాయికి రాను’, ‘బాయిలోనే బల్లి పలికే’, నిమ్మ తోట వనంలో, బావ బంగారం’ వంటి జానపథ పాటలకు బ్యాక్‌ గ్రౌండ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా తన సృజనాత్మకతను చాటుకుంటూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంతే కాకుండా సుమారు 25 జానపద గేయాల్లో హీరోగా నటనను నిరూపించుకున్నాడు. ప్రొడక్షన్‌ మేనేజర్‌గా 200 జానపథ గేయల చిత్రీకరణలో పనిచేశాడు.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న

శ్రీనివాస్‌

హైదరాబాద్‌లో ధూమ్‌ధామ్‌ కార్యక్రమం ద్వారా వెలుగులోకి

గాయకుడు రసమయి శిష్యుడిగా ప్రస్థానం

500కు పైగా జానపద పాటలకు సాహిత్యం అందించిన బుడ్డేపుపేట కుర్రాడు

టాలెంట్‌

స్వర్ణ బంగారు నంది బహూకరణ

పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి వచ్చిన శ్రీనివాస్‌ బహుముఖ ప్రతిభకు ఇటీవల రుద్ర ది బెస్ట్‌ హెల్పింగ్‌ ఫౌండేషన్‌, రుద్ర స్టూడియోస్‌ నిర్వాహకులు ప్రముఖ నటుడు సమీర్‌ చేతుల మీదుగా ‘స్వర్ణ బంగారు నంది’ అవార్డు ప్రదానం చేశారు. కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేయాలన్న పట్టుదల ఉంటే పల్లె నుంచి భాగ్యనగరం దాక విజయబాట తప్పదని తెలియజేసిన శ్రీనివాస్‌ తన పేరును ‘శ్రీను శ్రీకాకుళం’గా మార్చుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement