వారి నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని అఫీషియల్ కాలనీకి చెందిన అనంత పట్నాయకుని రామ్మోహనరావు(65), గుజరాతిపేటకు చెందిన పొట్నూరు నిర్మల(45) మృతిచెందడంతో వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్‌క్రాస్‌కు సమాచారం అందించారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ–టెక్నీషియన్ పూతి సుజాత, నంది ఉమాశంకర్‌ల ద్వారా కార్నియాలు సేకరించి విశాఖ ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. సహకరించిన కుటుంబ సభ్యులకు చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్, సభ్యులు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు.
వారి నేత్రాలు సజీవం


