హోరాహోరీగా పోరు
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తండ్యాలవలస పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న వార్షిక పోలీసు స్పోర్ట్స్ గేమ్స్ మీట్ రెండో రోజు గురువారం ఉత్సహభరితంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులు అధికారులు, సిబ్బంది ఉత్సహంగా క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్, జావెలిన్ త్రో, ట్రాక్ రన్నింగ్, షాట్‌పుట్ వంటి పోటీలు హోరాహోరీగా సాగాయి. మహిళా సిబ్బంది కోసం మ్యూజికల్ చైర్, స్పూన్ గేమ్, రింగ్ టెన్నిస్ తదితర వినోదాత్మక క్రీడలు కొనసాగాయి. – శ్రీకాకుళం రూరల్
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం


