పారిశుద్ధ్య నిర్వహణకు ఈ–ఆటోలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఎనిమిది ఎలక్ట్రికల్ ఆటోలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య మాట్లాడుతూ కవిటి మండలం రాజపురం పంచాయతీ, కంచిలి మండలం ఎం.ఎస్.పల్లి, ఇచ్ఛాపురం మండలం మసకాపురం, వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరు, మందస మండలం బుడారిసింగి, పలాస మండలం తర్లకోటకు ఒక్కొక్కటి చొప్పున, కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు రెండు వాహనాలు మంజూరైనట్లువివరించారు. వాహనాల పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అనుభవం ఉన్న డ్రైవర్లతో పని చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ భారతి సౌజన్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


