మిస్సమ్మ బంగ్లా స్థలం పరిశీలన
టెక్కలి: టెక్కలి పాతబస్టాండ్‌లో మిస్సమ్మ బంగ్లా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు.ఈ స్థలంలో కొన్నేళ్లుగా వివాదాలు చోటు చేసుకుని నిరుపయోగంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్డీఓ నేతృత్వంలో రెండు రోజులుగా జంగిల్ క్లియరెన్స్ చేస్తూ స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. సుమారు 1.75 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన ఆక్రమిత స్థలాన్ని సైతం స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.సత్యం, డీటీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ, ఆర్డీఓ


