శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

శ్రీకాకుళం

శ్రీకాకుళం

పల్లెపాట.. భాగ్యనగర బాటబుడ్డేపుపేట కుర్రాడు అదరగొడుతున్నాడు. పాటలతో ఆకట్టుకుంటున్నాడు. –8లో బోర్డు బంగ్లా స్థలంపై.. నరసన్నపేటలోని బోర్డు బంగ్లా స్థలంపై అధికారులు దృష్టిపెట్టారు. ఎస్‌ఐ విచారణ ప్రారంభించారు. –8లో –మందస

న్యూస్‌రీల్‌

పల్లెపాట.. భాగ్యనగర బాటబుడ్డేపుపేట కుర్రాడు అదరగొడుతున్నాడు. పాటలతో ఆకట్టుకుంటున్నాడు. –8లో

శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

కార్యక్రమాల షెడ్యూల్‌

ఫిబ్రవరి 7 ఆంజనేయస్వామికి అభిషేకం.

8 వాసుదేవునికి అభిషేకం.

9 గరుడపూజ,ధ్వజారోహణం,

హనుమద్వాహనం, శేషవాహన సేవ.

10 కల్పవృక్ష వాహనం,

ఎదుర్కోలు ఉత్సవం.

11 వాసుదేవుని కల్యాణ మహోత్సవం.

12 పొన్నచెట్టు వాహనం,తెప్పోత్సవం, అశ్వవాహన సేవ.

13 రథోత్సవం, చక్రస్నానం, శ్రీ పుష్టయాగం కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు జరుగుతాయి.

మందసలోని వాసుదేవ పెరుమాళ్‌ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నా యి. ఈ బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు అయ్యాక త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో 2010 ఫిబ్రవరి 5వ తేదీన మొదటి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

ఆలయ చరిత్రలోకి వెళ్తే.. 1744వ సంవత్సరంలో మందస సంస్థానానికి స్థానాచార్యులుగా నరసాపురానికి చెందిన తెలికిచర్ల కందాడ రామానుజాచార్యస్వామి ఉండేవారు. ఆయన వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీయర్‌ స్వామి, గోపాలచార్య స్వామి శిష్యులుగా ఉండేవారు. వాసుదేవుని ఆల య ప్రాంగణంలోని వేద పాఠశాలలో వీరిద్దరూ పండిత విద్యను అభ్యసించారు. అప్పట్లో వాసుదేవునికి నిత్య అర్చనలు జరిగేవి. ఏటా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. రాచరిక పాలనలో వైభవోపేతంగా ఉత్సవాలు జరిగేవి. రాచరికం పోయాక బ్రహ్మోత్సవాలు నిలిచిపోయా యి. క్రమానంతరం ఆలయం కూడా జీర్ణావస్థకు చేరుకుంది. పెద్ద జీయర్‌ స్వామి తదనంతరం వచ్చిన త్రిదండిచిన్నజీయర్‌స్వామి ఆలయ ప్రాధా న్యతను గుర్తించి గురువుల స్మారకార్థం అభివృద్ధి చేసేందుకు సంకల్పించారు. 2000 జూలై 7వ తేదీన మధుభయ వేదాంత ఆచార్య పీఠం దేవదాయశాఖ నుంచి సర్వహక్కులను తీసుకుంది. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారు. ఒడిశాకు చెందిన కళాకారులతో పనులు చేయించి 2009 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన వేదపండితులతో స్వామిని పునఃప్రతిష్టించారు. ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తుంటారని ఆలయ ప్రధాన అర్చకులు గోపీనంబాళ్ల దాసుకూర్మాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవానికి హాజరైన భక్తులకు భోజన ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement